ఫోటో అడిగిన అభిమానిని.. అలా చేసిన తాప్సి.. నెట్టింట ట్రోలింగ్..!

lakhmi saranya
హీరోయిన్ తాప్సీ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. టాలీవుడ్ స్టార్స్ తో నటించి మంచి గుర్తింపును సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ. ఇక ప్రస్తుతం బాలీవుడ్ చెక్కేసి అక్కడ వరుస సినిమాలు చేస్తూ సందడి చేస్తుంది. అంతేకాకుండా ఇటీవల ఈ అమ్మడు బ్యాట్మెంటన్ ప్లేయర్ మథియాస్ ను ప్రేమ వివాహం చేసుకొని వార్తల్లో నిలిచింది. ఇక ఇప్పుడు మరోసారి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఈ బ్యూటీ.
తాప్సీ తన కారు ఎక్కేందుకు వెళుతుండగా ఫోటోగ్రాఫర్ ఫోటో ప్లీజ్ అంటూ వెంటపడ్డాడు. వారిని ఆమె పట్టించుకోకుండా ముందుకు వెళ్ళింది. అలాగే ఓ అభిమాని ఒక సెల్ఫీ మేడం అనుకుంటా తాప్సి వెనకాల వెళ్లాడు. ప్లీజ్ అని అడుగుతున్నా అభిమాని వైపు కన్నెత్తి కూడా చూడకుండా నేరుగా కారు ఎక్కేసింది ఈ ముద్దుగుమ్మ. ప్రజెంట్ ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియో చూసిన వారంతా.." పొగరు బాగా తలకి ఎక్కినట్లు ఉందిగా. ఏం చూసుకుని ఈ పొగరు.
నువ్వు పెద్ద పాన్ ఇండియా హీరోయిన్ అనుకుంటున్నావేమో నీకు అంత సీన్ లేదు. ఒక అభిమాని ప్లీజ్ అని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్న ఒక సెల్ఫీ ఇవ్వలేని నువ్వే హీరోయిన్ వి. నీలాంటి దానికి ఎంత సపోర్ట్ చేసిన వేస్ట్. రెండవసారి ఒక అభిమానిగా నిన్ను ఎవడు సెల్ఫీ అడగడు. నువ్వే డబ్బులు ఇచ్చి అడుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది " అంటూ మండిపడుతున్నారు ప్రేక్షకులు. ఇక ప్రజెంట్ తాప్సి టాలీవుడ్ లో ఎటువంటి సినిమా చేయడం లేదు. బాలీవుడ్ లోనే పలు సినిమాలను చేస్తూ అక్కడే స్థిర పడడానికి ప్రయత్నిస్తుంది ఈ బ్యూటీ. మంచి గుర్తింపును ఇచ్చిన టాలీవుడ్ ని పూర్తిగా మర్చిపోయింది. మరి రానున్న రోజుల్లో ఆయన ఈ బ్యూటీ టాలీవుడ్ వైపుకు వస్తుందో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: