దేవర ప్రీపోన్ వల్ల ఎన్ని కోట్ల లాభమో తెలిస్తే షాక్ అవుతారు..!?

Anilkumar
పాన్ ఇండియా స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న లేటెస్ట్ సినిమా దేవర. మాస్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా భారీ బడ్జెట్ తో రూపొందుతోంది. ఇకపోతే ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ సరసన  బాలీవుడ్ బ్యూటీ జాన్వికపూర్ హీరోయిన్గా నటిస్తోంది. అలాగే ఇందులో జూనియర్ ఎన్టీఆర్ కి విలన్ పాత్రలో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ నటించబోతున్నారు. ఇకపోతే మ్యూజిక్ సెన్సేషన్ అనిరుద్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా నుండి ఇప్పటికే ఫస్ట్ సింగిల్ విడుదల చేశారు మేకర్స్. ఇక జూనియర్ ఎన్టీఆర్

 పుట్టినరోజు సందర్భంగా విడుదలైన ఈ పాట సోషల్ మీడియాలో దుమ్ము రేపుతోంది. అంతేకాదు యూట్యూబ్లో రికార్డు వ్యూ సైతం సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమాని అక్టోబర్ 10న విడుదల చేయబోతున్నాము అంటూ ఇదివరకే అధికారికంగా ప్రకటించేశారు. కానీ ఊహించని విధంగా ఇప్పుడు ఈ సినిమా ప్రీ పోన్ అయినట్లుగా దానికి సంబంధించిన ఒక అధికారిక పోస్ట్ పెట్టారు చిత్ర బృందం.  నిన్న సోషల్ మీడియా వేదికగా ఒక పోస్టర్ విడుదల చేయడంతో అది ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది. అయితే తాజాగా ఇప్పుడు

 ఈ సినిమాని అక్టోబర్ 10 నుండి సెప్టెంబర్ 27న ఫ్రీ ఫోన్ చేసినట్లుగా ప్రకటించారు. అయితే ఈ సినిమా విడుదల అవుతున్న సమయంలోనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఓ జి సినిమా సైతం విడుదల చేయబోతున్నారు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన సైతం ఇదివరకే ఓజీ చిత్ర బృందం వెల్లడించారు. కానీ ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ కాస్త ఆలస్యం అవుతూ ఉండడంతో ఓ జి సినిమా రిలీజ్ కాస్త ఆలస్యం అయ్యే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది.  తాజాగా ఎన్టీఆర్ దేవర రిలీజ్ డేట్ లో మార్పులు రావడం అటు ఓజీ సినిమా రిలీజ్ ఆలస్యం కావడంతో ఇప్పుడు దేవర సినిమాకి ఇది ప్లస్ గా మారింది. దేవర సినిమా సోలోగా రావడంతో దాదాపుగా 50 కోట్లకు పైగానే లాభాలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయని అంటున్నారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: