ప్రమోషన్స్ విషయంలో సరికొత్త ట్రెండ్ సెట్ చేస్తున్న కల్కి..!?

Anilkumar
పాన్ ఇండియ‌న్‌ స్టార్ హీరో ప్రభాస్ గ‌తేడాదీ చివ‌రిలో సలార్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు మరో పాన్ ఇండియా మూవీ కల్కి 2898ఏడీ తో ప్రేక్షకులను పలకరించనున్నాడు. నాగ్‌ అశ్విన్ లాంటి టాలెంటెడ్ దర్శకుడు తెర‌కెక్కిస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై ప్రేక్షకులలో మొదటి నుంచి మంచి అంచనాలు ఉన్నాయి. మైథాలజికల్ సైన్స్ ఫిక్షన్ డ్రామాగా ఈ సినిమా తెర‌కెక్కుతుంది. ఇలాంటి జానర్‌లో ఓ సినిమా రావడం చాలా అరుదుగా జరుగుతూ 

ఉంటుంది. అది కూడా మహానటి ఫేమ్ నాగ అశ్విన్‌ లాంటి డైరెక్టర్ ఈ సినిమాకు దర్శకత్వం వహించడంతో అభిమానుల్లో మరింత హైప్‌ పెరిగింది.  అయితే జూన్ 27న ఎంతో గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొనడంతో సినిమాకి సంబంధించిన ప్రతి విషయంలో కూడా కొత్తదనం చూపిస్తున్నారు మేకర్స్. ఎప్పుడూ లేనివిధంగా చిత్ర యూనిట్ ప్రమోషన్స్ లో భాగంగా ఎన్నడు చేయని విధంగా ప్రమోషన్స్ చేయాలి అని ఫిక్స్ అయ్యారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సినిమాని ప్రమోట్ చేసే

 పనిలో బిజీగా ఉన్నారు. అయితే దీనికోసం కల్కి టీం సరికొత్తగా ప్రమోట్ చేయడంతో ఆ విషయం కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇందుకోసం కల్కి టీమ్‌ ప్రత్యేకవాహనాలను వినియోగిస్తోంది. వాహనాలకు ఎల్‌ఈడీ స్క్రీన్‌లను ఏర్పాటు చేసి దేశంలోని పలు ప్రధాన పట్టణాలు, నగరాల్లో తిప్పనున్నారు. దీనికి సంబంధించిన వివరాలను చిత్ర యూనిట్ సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించింది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. ఇదిలా ఉంటే కల్కి విడుదల తేదీ దగ్గరపడుతోన్న సమయంలో రికార్డుల మోత మొదలైంది. విడుదలకు ముందే సరికొత్త రికార్డులను తిరగరాస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా అమెరికా ప్రీమియర్‌ టికెట్స్‌ ప్రీ సేల్‌ బిజినెస్‌లో కల్కి దుమ్మురేపుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: