ఖాళీ దొరికితే అదే పని చేస్తా.. విజయ్ సేతుపతి..!?

Anilkumar
తమిళ స్టార్ విజయ్ సేతుపతి గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ప్రస్తుతం భాషతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తూ భారీ గుర్తింపును సంపాదించుకున్నాడు ఈ నటుడు. కేవలం హీరో గానే కాకుండా పలు సినిమాల్లో కీలక పాత్రలో నటిస్తున్నాడు. తెలుగులో ఇప్పటికే చాలా సినిమాల్లో విలన్ గా నటించి స్టార్ హీరోల కంటే ఎక్కువ గుర్తింపు తెచ్చుకున్నాడు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ప్రస్తుతం ఏడాదికి నాలుగు నుండి ఐదు సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు.  ఇకపోతే ఈ సినిమా కేవలం తమిళంలోనే కాకుండా

 తెలుగులో కూడా విడుదల కాబోతోంది. దీంతో ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ చేస్తూ బిజీగా ఉన్నాడు విజయ్ సేతుపతి. ఇందులో భాగంగానే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు తమిళ స్టార్ విజయ్ సేతుపతి  . ఇక ఇంటర్వ్యూలో భాగంగా పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నాడు.  ఆ విషయాలు ఏంటి అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.. దర్శకత్వ ప్రయత్నాలు ఎంతవరకూ వచ్చాయంటే? ఆసక్తికర సమాధానం ఇచ్చాడు తమిళ స్టార్ విజయ్ సేతుపతి . మంచి కథలకు కుదిరితే తప్పకుండా దర్శకుడిగానూ పనిచేస్తానన్నారు. మూడు సినిమాలకు ఇప్పటికే కథ,

 కథనాన్ని కూడా సిద్దం చేసుకున్నాను అని అన్నాడు తమిళ స్టార్ విజయ్ సేతుపతి . దీంతో మక్కల్ సెల్వన్ మరో పెద్ద ఐడియాతోనే ఉన్నాడని తెలుస్తోంది. షూటింగ్ ఉంటే సెట్స్ కి హాజరవ్వడం, ఖాళీగా ఉన్న సమయంలో ఇలా కథలు రాసుకుంటున్నట్లు తెలుస్తోంది. అయితే కెప్టెన్ కుర్చీ ఎప్పుడు? అన్నది మాత్రం స్పష్టత ఇవ్వలేదు. నటుడిగా బిజీగా ఉన్నంత కాలం అదే మార్గంలో ప్రయానిస్తాడని తెలుస్తోంది. అటుపై అవకాశాలు తగ్గిన తర్వాత కెప్టెన్ కుర్చి ఎక్కుతాడని తెలుస్తోంది. దీంతో ప్రస్తుతం తమిళ స్టార్ విజయ్ సేతుపతి  చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: