రాజకీయాల ఈజీనా.. సినిమాలా.. కంగన ఏం చెప్పిందంటే?

praveen
బాలీవుడ్ హీరోయిన్ కంగనా  గురించి ప్రేక్షకులకు కొత్తగా పరిచయం అక్కర్లేదు. బాలీవుడ్ ప్రేక్షకులకు మాత్రమే కాదు టాలీవుడ్ ప్రేక్షకులకు కూడా ఈమె సుపరిచితురాలే. ఎందుకంటే టాలీవుడ్ లో కూడా కొన్ని సినిమాల్లో నటించింది ఈ ముద్దుగుమ్మ. అయితే సినిమాల్లో బోల్డ్ సీన్స్ లో నటించి రక్తం కట్టించడంలో కంగనాను మించిన వారు లేరేమో అనే రేంజ్ లో అదరగొడుతూ ఉంటుంది అని చెప్పాలి. అయితే సినిమాల్లో స్టార్ హీరోయిన్గా కొనసాగి మంచి గుర్తింపును సంపాదించుకుంది.

 అయితే ఇలా సినిమా ఇండస్ట్రీలో కంగానా రనౌత్ మంచి గుర్తింపును సంపాదించుకోవడమే కాదు..  ఎప్పుడు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో కూడా ఎప్పుడు హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటుంది అని చెప్పాలి. అయితే ఇలా సినిమాలతో పాటుగానే వివాదాలతో కూడా ఆమెకు వచ్చిన గుర్తింపు కాస్త ఎక్కువగానే ఉంది అని చెప్పాలి. అయితే ఇక ఇటీవల ఏకంగా రాజకీయాల్లోకి అడుగుపెట్టిన కంగన రనౌత్ మొదటి ప్రయత్నంలోనే ఘనవిజయాన్ని అందుకుంది. ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో హిమాచల్ లోని మండి పార్లమెంట్ సెగ్మెంట్ నుంచి బిజెపి తరఫున బరిలోకి దిగిన కంగనా.. ఘన విజయాన్ని అందుకుంది అని చెప్పాలి.

 ఈ క్రమంలోనే ఇలా ఎంపీగా గెలిచిన కంగనాను  సినిమాలకు దూరంగా ఉండే అవకాశం ఉంది అంటూ గత కొంతకాలం నుంచి వార్తలు వస్తున్నాయి. అయితే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ బాలీవుడ్ హీరోయిన్ రాజకీయాలు ఈజీనా.. లేదంటే సినిమాలు ఈజీనా అనే విషయంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. సినిమా రంగంతో పోల్చి చూస్తే రాజకీయాలు చాలా కష్టం అంటూ అభిప్రాయపడింది కంగనా.  ఒకప్పుడు మా ముత్తాత ఎమ్మెల్యేగా చేశారు. రాజకీయాల్లోకి రావాలంటూ నాకు కూడా చాలా ఆఫర్లు వచ్చాయి. కానీ సరైన సమయం కోసం ఆగాను. సినిమా లైఫ్ అనేది ఒత్తిడి లేనిది. కానీ రాజకీయాలు చాలా కష్టం. ఎంతోమంది సమస్యలతో వస్తుంటారు. అన్నింటిని క్షుణ్ణంగా పరిశీలించాలి అంటూ కంగానా చెప్పుకొచ్చింది

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: