ఏపీ:పవన్ కళ్యాణ్ పై టిడిపి ఎమ్మెల్యే సంచలన కామెంట్స్..!

Divya
ఆంధ్రప్రదేశ్లో కొత్తగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడింది. సీఎంతో పాటు క్యాబినెట్ మంత్రుల పదవి కూడా ప్రమాణ స్వీకారం చేపట్టారు. అలాగే బాధ్యతలను కూడా స్వీకరించే కార్యక్రమం కూడా ఇటీవలే ముగిసింది. ఈ సమయంలోనే టిడిపి ఎమ్మెల్యే మాజీమంత్రి తాజాగా చేసినటువంటి కామెంట్స్ ఇప్పుడు రాజకీయాలలో హీట్ పుట్టిస్తున్నాయి. ఎన్నోసార్లు శాసనసభకు ఎన్నికైన ఈ నేతకు ఈసారి క్యాబినెట్ల అవకాశం దక్కలేదు. దీంతో అసంతృప్తితోనే ఈ విధంగా కామెంట్స్ చేశారని విధంగా వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా తన కొడుకును ఎంపీగా నిలబెట్టి ఈ ఎన్నికల నుంచి రాజకీయంగా రిటైర్డ్ కావాలని భావిస్తున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇవేమీ జరగకపోవడంతో ఇప్పుడు కూటమి పైన సంచలన వ్యాఖ్యలు చేసినట్లు సమాచారం.

పవన్ కళ్యాణ్ సహకారంతోనే కూటమి ఏర్పడిందని విజయం కూడా ఆయనకే కీలకంగా ఉందని చంద్రబాబు స్వయంగా ఎన్నోసార్లు తెలిపారు. ఈ విషయాన్ని అయ్యన్నపాత్రుడు మాత్రం ఖండించారు. ఈసారి ఎన్నికల విజయం ఏ ఒక్క నేతది కాదని ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ది అవ్వడం సమంజసం కాదని మోడీ చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఎవరివల్ల కూటమి గెలవలేదని కేవలం అందరి స్వయం కృషితోనే ఇది సాధ్యమైంది అంటూ చెప్పారు.

అయ్యన్నపాత్రుడు లాంటి సీనియర్ నేత ఇలాంటి వాక్యాలు మాట్లాడడం ఇప్పుడు చర్చనీ అంశంగా మారుతోంది.ముఖ్యంగా కొత్త ప్రభుత్వం ఏర్పడిన సమయంలో ఇలాంటి వాక్యాలు ఎందుకు చేశారనే విషయాల పైన సందేహం కూడా కలుగుతోంది. ఏపీలో వైసీపీను ఓడించి ఎన్డీఏ కూటమిగా ఉన్న టిడిపి బిజెపి జనసేన పార్టీకి అధికారాన్ని కట్టబేట్టారు ప్రజలు. అయితే ఈ విజయానికి కూటమికి ఏర్పడడానికి ప్రధాన కారణం పవన్ కళ్యాణ్ అని చంద్రబాబు ఒప్పుకున్నప్పటికీ అయ్యన్నపాత్ర మాత్రం ఒప్పుకోలేదు... రాజకీయాలలో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఒక్కరికే ఉంటుందని సంచలన కామెంట్ చేశారు. వైసిపి ప్రభుత్వం లో అధికారులు వేధింపులకు గురి చేశారని టిడిపి కార్యకర్తలు నేతలపైన అక్రమ కేసులు పెట్టి చాలా ఇబ్బందుల గురి చేశారని అలాంటి వారందరినీ వదిలిపెట్టే ప్రశక్తి లేదంటే ఇన్ డైరెక్ట్ గా వార్నింగ్ ఇచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: