పవన్ కళ్యాణ్ ప్రమాణస్వీకారానికి మెగా కోడలు డుమ్మా.. అదే కారణమా..!?

Anilkumar
టాలీవుడ్ హీరోయిన్లలో ఒకరైన లావణ్య త్రిపాఠి గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు .ఇప్పటివరకు ఎన్నో అద్భుతమైన సినిమాల్లో నటించి  గుర్తింపును సంపాదించుకున్న ఈమె ఇటీవల మెగా కోడలు అయిన సంగతి మనందరికీ తెలిసిందే. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తో దాదాపుగా ఏడు సంవత్సరాలు ప్రేమలో ఉన్న ఈ బ్యూటీ గత ఏడాది కుటుంబ సభ్యుల సమక్షంలో అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకున్నారు. అయితే ఈ బ్యూటిఫుల్ కపుల్ కి సంబంధించిన వార్తలు నిరంతరం సోషల్ మీడియాలో వినబడుతూనే ఉంటాయి.

అలాగే ఇటీవల  వరుణ్ తేజ్ కాలికి చిన్నపాటి శస్త్ర చికిత్స జరిగింది అంటూ సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున కథనాలు వినబడ్డాయి. కానీ అందులో ఎటువంటి నిజం లేదు అని మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఖండించాడు. ప్రస్తుతం మేమిద్దరం లండన్ లో ఎంజాయ్ చేస్తున్నాము అంటూ తెలిపాడు. ఇటువంటి కథనాలు ఎలా పుట్టుకొస్తున్నాయో మాత్రం నాకు అసలు అర్థం కావడం లేదు అంటూ వెల్లడించాడు. కానీ ఇంతలోనే మెగా కోడలు వరుణ్ తేజ్ భార్య లావణ్య త్రిపాటికి కాలికి చిన్న గాయం అయినట్టుగా తెలుస్తోంది. తన కాలికి కట్టు ఉండడంతో ఈ ప్రచారం మొదలైంది. అంతేకాదు ఈ గాయం కారణంగానే నిన్న జరిగిన జనసేన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రమాణ

 స్వీకార కార్యక్రమానికి కూడా లావణ్య రాలేకపోయినట్లుగా సమాచారం వినపడుతోంది. తన కుడి కాలికి గాయం అయింది అని తాజాగా లావణ్య త్రిపాఠి తన సోషల్ మీడియా వేదికగా తెలియజేసింది. ఈ విషయాన్ని తానే స్వయంగా తెలియజేయడంతో ఈ వార్త వై క్లారిటీ వచ్చింది. అంతేకాదు తన కాలికి అయిన గాయానికి సంబంధించిన ఫొటోస్  షేర్ చేసింది లావణ్య త్రిపాఠి. ఇకపోతే లావణ్య త్రిపాఠి సినిమాల విషయానికి వస్తే.. పెళ్లి ముందు వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నా లావణ్య త్రిపాఠి సినిమాల తర్వాత కథల విషయంలో చాలా జాగ్రత్తలు వహిస్తోంది. ఆచితూచి సినిమాల పరంగా  ఆచితూచి అడుగులు వేస్తోంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: