రేవ్ పార్టీ కేసులో నటి హేమకు ఊరట..!

Divya
బెంగళూరు రేవ్ పార్టీ కేసులో నటి హేమ తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంది. మొదట హేమ ఈ విషయం పైన ఒప్పుకోకపోయినా చివరికి అన్నిటిని పరిశీలించిన తర్వాత అధికారులు ఈమె పేరు ఉన్నట్లు గుర్తించారు. ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీలో అగ్రహార జైలులో ఈమె ఉన్నది. నిన్నటి రోజున ఈమెకు బెయిల్ మంజూరైనట్లుగా తెలుస్తోంది. బెంగళూరు రూరల్ ఎం.పి.ఎస్ ప్రత్యేక కోర్టు హేమకి షరతులతో కూడినటువంటి బెయిల్ని కూడా మంజూరు చేసినట్లు సమాచారం. ముఖ్యంగా హేమ నుంచి ఎలాంటి డ్రగ్స్ కూడా లభించలేదని చాలా రోజుల తర్వాత వైద్య పరీక్షలు నిర్వహించామని హేమా తరుపున న్యాయవాది కూడా తెలియజేశారు.

గడిచిన కొద్దిరోజుల క్రితం పోలీసులు జిఆర్ ఫామ్హౌస్ పైన దాడి చేసినప్పుడు నటి హేమ కూడా అక్కడ పట్టుబడింది. అయితే ఈ వార్త రాగానే హేమ అదే ఫామ్ హౌస్ నుండి వీడియోని రికార్డు చేసి సోషల్ మీడియాలో విడుదల చేసింది. ఈ వీడియో ద్వారా తాను హైదరాబాదులోనే ఉన్నట్టుగా చూపించే ప్రయత్నం అయితే చేసింది.. అయితే ఈ పార్టీలో మరి కొంతమంది సెలబ్రిటీలు కూడా పాల్గొన్నారని మరి కొంతమంది వస్తూ ఉండేవారని ధృవీకరించారు.

మొదటిసారి హేమకు నోటీసులు జారీ చేసినప్పుడు అనారోగ్య కారణాలతో ఈమె విచారణకు హాజరు కాలేనని తెలిపింది. రెండవసారి బెంగళూరు పోలీసులు నోటీసులు జారీ చేసినప్పుడు ఆమె బుర్కా ధరించి విచారణకు సైతం హాజరైనది. దీంతో ఆమెకు కోర్టు 14 రోజులపాటు జ్యుడీసీఎల్ కస్టడీ కూడా విధించింది. ఆ తర్వాత మా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కూడా హేమ సభ్యత్వాన్ని కూడా రద్దు చేసింది ఇప్పుడు ఇదే కేసులో హేమాకు బయలు రావడంతో కాస్త ఊరటనీచ్చిందని కూడా చెప్పవచ్చు. గతంలో ఎన్నో చిత్రాలలో నటించినటువంటి హేమ ఇప్పుడు ఇలాంటి రేవ్ పార్టీ రక్ష కేసు ఆరోపణలో ఇరుక్కోవడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: