బన్నీ ఫ్యాన్స్ కి షాక్ : పుష్ప 2 రిలీజ్ వాయిదా..!?

Anilkumar
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ సినిమా పుష్ప 2. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో రష్మిక మందన హీరోయిన్గా నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన టీజర్ పోస్టర్స్ సోషల్ మీడియాలో దుమ్ము లేపుతున్నాయి. అలాగే ఇటీవల ఫస్ట్ సింగిల్ సెకండ్ సింగిల్ కూడా విడుదల చేశారు మేకర్స్. దాంతో ఈ రెండు పాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉన్నాయి. అయితే  ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది.

 అదేంటంటే అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్లో వస్తున్న పుష్ప 2 సినిమా విడుదల వాయిదా పడే అవకాశాలు ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ఇదివరకే ఈ సినిమాని 2024 ఆగస్టు 15న విడుదల చేస్తాము అని అధికారికంగా ప్రకటించారు. కానీ ఇప్పుడు మాత్రం సినిమా వాయిదా పడే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఎందుకంటే దీని షూటింగ్ కోసం అదనంగా మరొక నెల రోజుల కంటే ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉన్నాయని అంటున్నారు. జూలై చివరికల్లా షూటింగ్ పూర్తి చేసుకుని విడుదల చేస్తారని ప్రచారం జరుగుతుంది.

 ఫిలిం ఎడిటర్ మారడంతో పాటు వి ఎఫ్ ఎక్స్ పై సుకుమార్ ఇంకా అసంతృప్తిగా ఉండడం దీనికి కారణమని అంటున్నారు. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా చేస్తారట. దీంతో ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది. ఇక పుష్ప 2 సినిమా విషయానికి వస్తే ఇందులో అల్లు అర్జున్ రష్మిక మందనలతో పాటు పహాద్ ఫాజిల్ అనసూయ సునీల్ కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. సుకుమార్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్లో వచ్చిన పుష్ప సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకోవడంతో దానికి సీక్వెల్ గా ఇప్పుడు పుష్ప 2  తెరకెక్కిస్తున్నారు. గతంలో వచ్చిన పుష్ప  బ్లాక్ బస్టర్ అవ్వడంతో ఇప్పుడు పుష్ప 2 పై భారీ అంచనాలు నెలకొన్నాయి. భారీ బడ్జెట్ తో వస్తున్న ఈ సినిమా కోసం బన్నీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: