ఆ సినిమా కోసం అదిరిపోయి ఫైట్ సీన్స్ చేయడానికి రెడీ అయిన సల్మాన్..!?

Anilkumar
సల్మాన్ ఖాన్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు .ఆయన నటించిన మొదటి సినిమా ఫ్లాప్ అయినప్పటికీ కూడా తన రెండో సినిమా "మైనే ప్యార్ కియా" సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నాడు సల్మాన్ ఖాన్. ఇక తర్వాత  వరుస సినిమాలు చేస్తూ ఎన్నో హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకున్నాడు. హిట్ ఫ్లాప్ అనే సినిమాలు  లేకుండా జెట్ స్పీడ్ తో దూసుకుపోతున్నాడు. ఇక పోయిన ఏడాదిలో రిలీజ్ అయిన టైగర్ 3 సినిమా ఎంతటి విజయాన్ని అందుకుందో అందరికీ తెలిసిందే. ఇక ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద దుమ్ము

 రేపింది. ఇదిలా ఉంటే తాజాగా ఏ ఆర్ మురుగదాస్ దర్శకత్వంలో సల్మాన్ ఖాన్ హీరోగా "సికిందర్" సినిమా చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ చిత్రం యాక్షన్ త్రిల్లర్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. సల్మాన్ ఖాన్ కి జోడిగా ఈ ఇందులో రష్మిక మందన్నా హీరోయిన్ గా నటిస్తోంది. అయితే ఇందులో సల్మాన్ ఖాన్ సికిందర్ గా అభిమానులను అలరించేందుకు వస్తున్నాడు. ఇదిలా ఉంటే ఈ సినిమా నుంచి ఒక అప్డేట్ వచ్చింది. సల్మాన్ ఖాన్ ముంబైలో అదిరిపోయే ఫైట్స్ చేసేందుకు సిద్ధం అవుతున్నట్లు తాజా సమాచారం.

 ఇక ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ఈనెల 18 నుంచి ముంబైలో ప్రారంభం కాబోతోంది. ఏఆర్ మృగదాస్ తొలుత యాక్షన్ సన్నివేశాలను షూటింగ్ చేసే క్రమంలో ఉన్నారు. అయితే ముంబైలో షూటింగ్ అయిపోయాక  విదేశాలలో భారీ షెడ్యూల్ ను జరుపుకోవాలని యూనిట్  ప్లాన్ చేస్తున్నారట. సాజిద్ నడియాడ్‌ వాలా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది రంజాన్ సందర్భంగా ఈ సినిమాని తెరకెక్కించబోతున్నారు. ఇదిలా ఉంటే  ప్రస్తుతం పుష్ప 2  షూటింగ్ లో ఉన్న రశ్మిక ఈ ఆగస్టు 15న శ్రీవల్లిగా మరోసారి స్క్రీన్ మీద మ్యాజిక్ చేయబోతోంది. ఆమె గర్ల్ ఫ్రెండ్ అనే ఫీమేల్ ఓరియెంటెడ్ మూవీలోనూ నటిస్తోంది. రశ్మిక అందుకుంటున్న అవకాశాలు చూస్తుంటే ప్రస్తుతం ఆమె బిగ్గెస్ట్ పాన్ ఇండియా హీరోయిన్ అనుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: