కన్నీళ్లు పెట్టిస్తున్న'హాయ్ నాన్న' ప్రోమో..!!

murali krishna
హైపర్ ఆది హోస్ట్ గా ఇంద్రజ జడ్జిగా.. వ్యవహరిస్తున్న శ్రీదేవి డ్రామా కంపెనీ.. గురించి తెలియని వారు ఉండరు. చాలామంది ఈ షో ఫ్యాన్స్ ఉన్నారు.కామెడీ షో గా ఎప్పటికప్పుడు.. ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించే శ్రీదేవి డ్రామా కంపెనీలో.. తాజాగా ఫాదర్స్ డే సందర్భంగా.. హాయ్ నాన్న అనే ఒక ప్రోగ్రామ్ రాబోతోంది. శ్రీదేవి డ్రామా కంపెనీలో.. నటించే ఆర్టిస్టులు కూడా తమ తల్లిదండ్రులతో.. ఈ ఎపిసోడ్ కి హాజరయ్యి అందరినీ అలరించారు.మొదట కామెడీ జోకులతో.. స్కిట్ లతో సరదాగా జరిగిన ప్రోమో.. తరువాత ఎమోషనల్ గా మారిపోయింది. మొదటగా తండ్రి..కూతురి మీద, కొడుకు మీద ఎవరి మీద ఎక్కువ ప్రేమ చూపిస్తారు.. అంటూ ఒక రౌండ్ చేశారు. అందులో తండ్రి రెండుసార్లు తన కూతురికే..సపోర్ట్ చేశారు.ఎప్పుడు కొడుకు వెన్నంటే సపోర్ట్ చేసే తండ్రి.. కూతురికి కష్టం వస్తే మాత్రం తట్టుకోలేక ముందుకు వచ్చేస్తారు.. అని ఈ ఎపిసోడ్ మరొకసారి నిరూపిస్తుంది. ఇక కొందరు ఆర్టిస్టులు చిన్నప్పుడు.. తమ నాన్నలతో దిగిన ఫోటోలను..మళ్లీ ఇప్పుడు రీ క్రియేట్ చేసి.. అందరి దృష్టిని ఆకర్షించారు.కాగా ఢీ చైతన్య మాస్టర్.. ఈ మధ్యనే ఏప్రిల్ లో సూసైడ్ చేసుకొని చనిపోయిన సంగతి తెలిసిందే. చైతన్య మాస్టర్ తల్లిదండ్రులు కూడా.. ఈ ఎపిసోడ్లో కనిపించారు. చనిపోయిన తన కొడుకుని గుర్తు తెచ్చుకొని.. ఆ తండ్రి కన్నీళ్లు పెట్టుకోగా, అక్కడివారు చైతన్య లేని లోటు.. తాము తీర్చలేము కానీ.. కొడుకుగా అతను చేయాల్సిన పనులు, అతని బాధ్యతలు తాము నెరవేరుస్తామని.. అక్కడివారు ఆయనకు మాట ఇవ్వడం.. అందరికంటా నీళ్లు తెప్పించింది.ఆఖరిగా ఒక స్కిట్ కూడా.. ప్రేక్షకుల గుండెకు హత్తుకునే విధంగా ఉంది. పేదరికంతో ఉన్నప్పటికీ తన పిల్లల ఆకలి తీర్చి పెద్ద చేసిన తండ్రిని.. ఆ కొడుకు పట్టించుకోకుండా.. అన్నం పెట్టడానికి కూడా కోపం తెచ్చుకోగా, కొడుకు పెట్టాల్సిన తలకొరివి తానే పెట్టుకుంటాను అంటూ ఆ తండ్రి నిప్పంటించుకుని చనిపోయినట్లుగా.. చేసిన స్కిట్ కూడా అందరినీ ఏడిపించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: