కల్కి ట్రైలర్ పై ట్రోల్స్.. దీపిక గురించేనా..!?

Anilkumar
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్  వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. అందులో కల్కి 2898 ఏడి సినిమా సినిమా ఒకటి. భారీ బడ్జెట్ తో ఈ సినిమా ను నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్నారు. ఇది ఇలా ఉంటే ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన ప్రోమో, గ్లింప్సే  ఈ చిత్రం పై ప్రేక్షకులలో  భారీ అంచనాలను పెంచింది. ఇదిలా ఉంటే జూన్ 27న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు  రాబోతుంది. ఈ నేపథ్యంలో మేకర్స్  తాజాగా ఈ చిత్రం నుంచి  ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ఎలివేషన్స్ తో కూడి  పవర్ ఫుల్ గా ప్రేక్షకుల అంచాలను  మరింత రెట్టింపు

 చేసేలా ఉంది ఈ ట్రైలర్. ఇక ఈ సినిమాలో ప్రభాస్ కు జోడిగా దీపిక పదుకొణే నటిస్తున్న విషయం తెలిసిందే. అంతేకాకుండా దిశా పటానీ, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ ఈ సినిమాలో పలు ఇంపార్టెంట్ రోల్స్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన ట్రైలర్ గురించి సోషల్ మీడియాలో తెగ వార్తలు వినిపిస్తున్నాయి. అదేంటంటే ఈ ట్రైలర్ కి ఫుల్ మార్కులు పడ్డాయి కానీ ఒక విషయంలో మాత్రం ఈ ట్రైలర్ చాలా ట్రోల్ అవుతుంది. అదేంటంటే దీపిక పదుకొణే తెలుగు డబ్బింగ్ విషయంలో.  ఈ సినిమాలో

 యాక్టర్లంతా దాదాపు తమ తమ పాత్రలకు వాళ్ళ సొంత వాయిస్ తో డబ్బింగ్ చెప్పుకుంటున్నారు. అమితాబ్ బచ్చన్, దిశా పటాని పలువురు వాళ్ళ ఓన్ వాయిస్ తో డబ్బింగ్ చెప్పుకుంటున్నారు. కానీ దీపికా  తెలుగు డబింగ్ మొదటి సారి కావటం వల్ల ప్రేక్షకులకు వాయిస్ బాగోలేదని విమర్శలు వస్తున్నాయి. దాన్ని వల్ల ఆమె వాయిస్ నచ్చలేదు అంటూ అభిమానులు ట్రోల్ చేస్తున్నారు. అంతే కాకుండా ఈ సినిమాకు తన వాయిస్ మైనస్ అయ్యే ఛాన్స్ ఉంది అంటూ చెప్పుకొచ్చారు సినీ లవర్స్. ఇక ఈ విషయం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: