రవితేజ దర్శకత్వంలో.. హీరోగా విశ్వక్ సేన్?

praveen
సినిమా ఇండస్ట్రీ అనే రంగుల ప్రపంచంలో బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలో రాణించడం చాలా కష్టంతో కూడుకున్న పని. కానీ సినిమానే ఫ్యాషన్ గా మార్చుకొని ప్రస్తుతం టాలీవుడ్ లో ఎంతోమంది బ్యాగ్రౌండ్ లేకుండానే ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి తమకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న వారు ఉన్నారు. అలాంటి వారిలో యంగ్ హీరో విశ్వక్సేన్ కూడా ఒకరు అన్న విషయం తెలిసిందే. ఎవరు అవకాశం ఇస్తారు ఇంకెవరో తన కెరియర్ను నిలబెడతారుఅని ఆశలు పెట్టుకోకుండా.. తానే నిర్మాతగా తానే దర్శకుడుగా తానే హీరోగా మారి సినిమా తీసాడు.

 తన కెరియర్ను తానే నిలబెట్టుకున్నాడు అని చెప్పాలి. ఇలా ఫలక్నుమా దాస్ అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన విశ్వక్సేన్.. తన నటనతో ఆకట్టుకున్నాడు. ఇక ఆ తర్వాత ఎక్కడ వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా ఇక వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. అయితే ఇటీవలే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు విశ్వక్. అయితే ఈ సినిమా మంచి విజయం సాధించడంతో ప్రస్తుతం జోరు మీద ఉన్నాడు అని చెప్పాలి. ఈ క్రమంలోనే వరుసగా సినిమాలకు ఓకే చెప్పేస్తున్నాడు. కాగా ఇక ఇప్పుడు విశ్వక్సేన్ నెక్స్ట్ మూవీ కి సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.

 రవితేజ దర్శకత్వంలో మెకానిక్ రాఖి అనే మూవీ చేయబోతున్నాడట విశ్వక్. రవితేజ అనగానే మాస్ మహారాజ రవితేజ అనుకునేరు. రవితేజ ముల్లపూడి అనే వ్యక్తి డైరెక్షన్లో ఈ మూవీ చేయబోతున్నాడు. జోబ్స్ విజయ్ ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నారు అన్నది తెలుస్తుంది. అయితే త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ కూడా కంప్లీట్ చేసుకోబోతున్నాడట ఈ యంగ్ హీరో. షూటింగ్ కంప్లీట్ అయిన తర్వాత అన్ని పనులను చకచకా పూర్తిచేసి.. ఈ ఏడాదిలోనే ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి విశ్వక్సేన్ ప్రయత్నాలు చేస్తున్నాడట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: