టాలీవుడ్ యువ నటుడు శ్రీ విష్ణు ప్రస్తుతం స్వాగ్ అనే సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ కి ఆసిత్ గోలి దర్శకత్వం వహిస్తున్నాడు. గతంలో శ్రీ విష్ణు , హసిత్ గోలి కాంబో లో రాజ రాజ చోరా అనే సినిమా వచ్చింది. ఈ మూవీ మంచి విజయం అందుకుంది. అలాగే ఇందులో శ్రీ విష్ణు నటనకు , ఆసిత్ గోలి దర్శకత్వ ప్రతిభ.కు ప్రేక్షకుల నుండి , విమర్శకుల నుండి మంచి ప్రశంసలు దక్కాయి.
ఇలా రాజ రాజ చోరా వంటి మంచి విజయవంతమైన సినిమా తర్వాత వీరి కాంబోలో రూపొందుతున్న సినిమా కావడంతో స్వాగ్ మూవీ పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఇక ఆ అంచనాలకు తగ్గట్లే ఈ మూవీ నుండి మేకర్స్ విడుదల చేస్తున్న ప్రచార చిత్రాలు కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి. ఇక ఈ సినిమాలో అనేక మంది టాలెంటెడ్ నటి నటులు కనిపించబోతున్నారు. ఈ మూవీ లో శ్రీ విష్ణు కు జోడిగా మోస్ట్ బ్యూటిఫుల్ నటిమని రీతు వర్మ హీరోయిన్ గా కనిపించనుండగా , టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోయిన్ మీరా జాస్మిన్ ఈ మూవీ లో కీలక పాత్రలో కనిపించబోతుంది.
తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమాలో మరో ముద్దుగుమ్మ కూడా ఉండబోతున్నట్లు అధికారికంగా ధ్రువీకరిస్తూ ఓ పోస్టర్ ను విడుదల చేశారు. ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు కలిగిన నటిగా కెరియర్ ను కొనసాగిస్తున్న ద్రాక్ష నాగర్కర్ ఈ మూవీ లో కీలక పాత్రలో కనిపించబోతున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటిస్తూ ఈ బ్యూటీ కి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేశారు. ఆ పోస్టర్ ప్రస్తుతం వైరల్ అవుతుంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత టి జి విశ్వ ప్రసాద్ ఈ మూవీ ని నిర్మిస్తూ ఉండగా , వివేక్ సాగర్ ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నారు.