BB4 లో ఆ యంగ్ హీరో.. ఏకంగా అలాంటి పాత్రలో..!?

Anilkumar
నందమూరి నట సింహం బాలకృష్ణ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు.  యంగ్ హీరోలకి పోటీగా ఈ వయసులో కూడా వరుస సినిమాలను అలౌన్స్ చేస్తున్నాడు. ఇందులో భాగంగానే తాజాగా ఆయన పుట్టినరోజు సందర్భంగా బీబీ 4 అంటూ బోయపాటి కాంబినేషన్లో నాలుగవ సినిమా సైతం అనౌన్స్ చేశాడు. ఇకపోతే ఈ సినిమాలో నందమూరి బాలకృష్ణ డ్యూయల్ పాత్రలో కనిపించబోతున్నాడు అన్న వార్తలు ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున వినబడుతున్నాయి. అయితే ఇప్పటికే వీళ్లిద్దరి

 కాంబినేషన్లో వచ్చిన సినిమాలన్నీ టీలో కూడా నందమూరి నట సింహం బాలకృష్ణ   డ్యూయల్ పాత్రలో కనిపించాడు. దీంతో ఇప్పుడు కూడా ఈ సినిమాలో ద్విపాత్రాభినయం చేయబోతున్నాడు అంటూ సోషల్ మీడియా వేదికగా వార్తలు వస్తున్నాయి. అయితే తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది. అది ఏంటంటే.. నందమూరి నట సింహం బాలకృష్ణ హీరోగా నటించబోతున్న ఈ సినిమాలో టాలీవుడ్ కి చెందిన ఒక యంగ్ హీరో కూడా నటించబోతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి . ఇక ఆ యంగ్ హీరో మరెవరో కాదు

 కిరణ్ అబ్బవరం. అయితే ఇందులో ఈ యంగ్ హీరోని ఒక కీలక పాత్ర కోసం తీసుకున్నట్లుగా సమాచారం వినబడుతోంది.  దర్శకుడు బోయపాటి శ్రీను కోరిక మేరకు ఆయన ఈ సినిమాలో ఒక కీలక పాత్రలో కనిపించబోతున్నాడట. ఇక కిరణ్ అబ్బవరం కు కూడా ప్రస్తుతానికి హిట్లు ఏమీ లేవు కాబట్టి ఆయన కూడా బోయపాటి డైరెక్షన్ లో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. మరి ఆ పాత్ర ఏంటి అనేది సినిమా యూనిట్ రివీల్ అయితే చేయలేదు. కానీ అది సినిమాలో ఒక కీలక పాత్ర అయి ఉంటుంది అని చాలామంది సినీ మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: