ఓటిటి లోకి వచ్చేస్తున్న గెటప్ శ్రీను రాజు యాదవ్.. ఎప్పుడంటే..!?

Anilkumar
బుల్లితెరపై స్టార్ కమెడియన్గా పేరు తెచ్చుకున్న గెటప్ శ్రీను గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఎంతసేపైనా సరే అలవోకాగా  నవ్వించగల టాలెంట్ ఉన్న గెటప్ శ్రీను ఇప్పటికే చాలా మంది స్టార్ హీరోలు సినిమాల్లో నటించాడు. అదే కాదు కొన్ని సినిమాల్లో కీలక పాత్రల్లో కూడా కనిపించాడు. అయితే తాజాగా ఇప్పుడు ఈ కమెడియన్ హీరోగా కూడా ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. జబర్దస్త్ షో ద్వారా గెటప్ శ్రీను హీరోల కంటే ఎక్కువ స్థాయిలో గుర్తింపును తెచ్చుకున్నాడు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు .బుల్లితెర

 కమలహాసన్ గా పేరు తెచ్చుకున్న జబర్దస్త్ శ్రీను తనకి సినిమాల పైన ఉన్న ఇంట్రెస్ట్ తో తాజాగా రాజు యాదవ్ అని సినిమా చేశాడు. హీరోగా ఆయన పరిచయం అవుతూ చేసిన ఈ సినిమాని కృష్ణమాచారి దర్శకత్వంలో వచ్చింది. వరుణ్ వి క్రియేషన్స్ పతాకంపై రాజేష్ కల్లేపల్లి ప్రశాంత్ రెడ్డి నిర్మించిన ఈ సినిమాకి హర్షవర్ధన్ సురేష్ మ్యూజిక్ అందించారు. బుల్లితెరపై స్టార్ కమెడియన్గా పేరు తెచ్చుకున్న గెటప్ శ్రీను రాజు యాదవ్   మూవీ ఈ ఏడాది మే 24వ తేదీన థియేటర్లలో రిలీజ్ అయింది.ఆసక్తికర కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమాకు విడుదలకు ముందు మంచి క్రేజ్ ఏర్పడింది. అయితే థియేటర్లలో రిలీజ్

 అయ్యాక ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయింది. దీంతో ఈ మూవీ ఓటిటి స్ట్రీమింగ్ కు వచ్చేందుకు సిద్ధం అయింది. ఈ చిత్రం డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటిటి ప్లాట్ ఫామ్ దక్కించుకున్నట్లు సమాచారం.. జూన్ 22 న ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కు రానున్నట్లుగా ఓ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.త్వరలోనే ఈ విషయంపై మేకర్స్ అధికారిక ప్రకటన చేయనున్నట్లు సమాచారం. దీంతో ప్రస్తుతం ఎవరితో సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: