థగ్ లైఫ్ నుండి దిమ్మతిరిగే అప్డేట్.. మూడు పాత్రల్లో కమలహాసన్..!?

Anilkumar
విశ్వ నటుడు కమల్ హాసన్ నటించిన లేటెస్ట్ మూవీ “ఇండియన్ 2 “.స్టార్ డైరెక్టర్ శంకర్ ఈ సినిమాను తెరకెక్కించారు.ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్ ,రెడ్ జైంట్ మూవీస్ బ్యానర్స్ పై ఉదయనిధి స్టాలిన్ మరియు సుభాస్కరన్ భారీ బడ్జెట్ తో ఎంతో గ్రాండ్ గా తెరకెక్కిస్తున్నారు.ఈ సినిమా గతంలో బ్లాక్ బస్టర్ హిట్ అయిన ‘ఇండియన్’ సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కింది.   ఇకపోతే భారతీయుడు సినిమాలో కమల్తో పాటు ర‌కుల్ ప్రీత్ సింగ్, ప్రియా భ‌వానీ శంక‌ర్‌, బ్రహ్మానందం, ఎస్‌జే సూర్య, సిద్దార్థ్‌, స‌ముద్రఖని, బాబీ సింహా,

 మధుబాల, కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ -రెడ్ జేయింట్స్ బ్యానర్పై ఉద‌య‌నిధి స్టాలిన్‌, లైకా సుభాస్కరన్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇదిలా ఉంటే కమల్ హాసన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ “థగ్ లైఫ్ “..ఈ సినిమాను తమిళ్ స్టార్ డైరెక్టర్ మణిరత్నం తెరకెక్కిస్తున్నారు.కమల్,మణిరత్నం కాంబినేషన్ లో 37 ఏళ్ళ తరువాత  వస్తున్న సినిమానే “థగ్ లైఫ్ “..ఈ సినిమాను కమల్ హాసన్ ,ఆర్ మహేంద్రన్ ,మణిరత్నం సంయుక్తంగా నిర్మిస్తున్నారు.ఈ సినిమాకు ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ మ్యూజిక్

 అందిస్తున్నారు.ఈ సినిమాలో శింబు కీలక పాత్ర పోషిస్తున్నాడు. థగ్ లైఫ్ షూటింగ్ 60 % షూటింగ్ పూర్తయినట్లు తెలుస్తుంది.మరో 40 రోజుల్లో మిగిలిన షూటింగ్  పూర్తి చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.పీరియాడిక్ గ్యాంగ్ స్టర్ డ్రామాగా ఈ సినిమా రూపొందుతుంది. అయితే   ఈ సినిమాలో కమల్‌ హాసన్‌ ట్రిపుల్‌ రోల్‌లో కనిపిస్తాడని టాక్‌. రాజ్‌కమల్‌ ఫిల్మ్స్‌ ఇంటర్నేషనల్, మద్రాస్‌ టాకీస్, రెడ్‌ జెయింట్‌ మూవీస్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో త్రిష  కథానాయిక. మొత్తానికి అయితే ఏ వార్త ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది మరి ఇందులో నిజం ఏంటి అనేది తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేంతవరకు ఆగాలి..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: