ఎఫైర్స్, పెళ్లి వల్ల కెరియర్ నాశనం చేసుకున్న హీరోయిన్..!

Divya
సినీ ఇండస్ట్రీలో లవ్, బ్రేకప్, వివాహాలు విడిపోవడం లాంటిది చాలా కామన్ గా మారిపోయాయి. ఈ మధ్యకాలంలో చాలా మంది వివాహాలు చేసుకుని సెటిల్ అవుతూ ఉంటే మరి కొంతమంది విడాకులు బ్రేకప్స్ తో నిరంతరం వైరల్ గా మారుతూనే ఉన్నారు. ఒకరితో ప్రేమ మరొకరితో వివాహం చేసుకున్న చాలామంది సెలబ్రిటీలు ఉన్నారు. ఈమధ్య నటి నిఖిత కూడా తన కెరీర్ పీక్స్ లో ఉన్న సమయంలో పెళ్లయిన హీరోతో ఎఫైర్ పెట్టుకోవడంతో ఆఫర్స్ లేక చివరికి మరొక బిజినెస్ మాన్ వివాహం చేసుకొని సెటిల్ అయ్యింది.

అలా ఒక హీరోయిన్ కూడా తన తోటి నటులతో ప్రేమలో పడి తన కెరీర్ మీద ఫోకస్ పెట్టలేక ఇబ్బంది పడింది. ఏకంగా 12 మంది హీరోలతో ఎఫైర్స్ పెట్టుకుంది.. ఆ హీరోయిన్ ఎవరో కాదు అలనాటి హీరోయిన్ మనీషా కొయిరాలా.. ఈ అమ్మడు తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా సుపరిచితమే ఎన్నో డబ్బింగ్ చిత్రాలలో నటించి ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. 1991లో సాధాకర్ అనే సినిమాతో మొదటిసారిగా తన కెరీర్ ని బాలీవుడ్లో అడుగుపెట్టింది. అలా తెలుగు తమిళ్ హిందీ వంటి చిత్రాలలో కూడా నటించింది.

ముఖ్యంగా భారతీయుడు, ఒకే ఒక్కడు, బొంబాయి వంటి సినిమాలతో భారీ క్రేజ్ అందుకుంది. షారుక్ ఖాన్ హీరోగా మనిషా కొయిరాల నటించిన దిల్ సే సినిమా కూడా మంచి సంచలన విజయాన్ని అందుకుంది. ఇదంతా ఇలా ఉంటే అప్పట్లో ఈ ముద్దుగుమ్మ ఏకంగా 12 మంది హీరోలతో ప్రేమలో పడిందట. చాలామంది కోస్టార్స్ తో ఈమె ప్రేమలో పడిందని అప్పట్లో తెగ వార్తలు వినిపించాయి. అయితే ఆ ప్రేమలు మాత్రం ఎక్కువ రోజులు నిల్వలేకపోయాయని సమాచారం. 2010లో నేపాల్ కు చెందిన సామ్రాట్ దహళ్లను వివాహం చేసుకున్నప్పటికీ ఆ తరువాత రెండేళ్లకే విడిపోవడం జరిగింది. ఆలాగే వరుసగా సినిమాలు ప్లాప్ అవడంతో డిప్రెషన్ కి గురై ఏకంగా మద్యానికే బానిసయ్యిందట మనిషా కొయిరాలా.. అయితే ఈ సమయంలోనే క్యాన్సర్ బారిన పడటంతో చివరికి ధైర్యంగా క్యాన్సర్ నీ జయించి ఇటీవలే హిరామండి వెబ్ సిరీస్లో నటించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: