కాంచన 4 లో మృణాల్.. క్లారిటీ ఇచ్చిన లారెన్స్..!?

Anilkumar
మొదట కొరియోగ్రాఫర్ గా తన కెరియర్ను ప్రారంభించిన రాఘవ లారెన్స్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. కొరియోగ్రాఫర్ గా తన కెరీర్ని ప్రారంభించినప్పటికీ హీరోగా కూడా తన సత్తా ఏంటో చూపించుకున్నాడు. అదేవిధంగా దర్శకుడుగా కూడా వరుస సినిమాను చేస్తూ దూసుకుపోతున్నాడు. గత ఏడాది చంద్రముఖి జిగల్ తండా డబల్ ఎక్స్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని సాధించాడు. అయితే ఈ సినిమా యావరేజ్ టాక్ అందుకున్నప్పటికీ ఆయనకి వరస సినిమాల్లో నటించే అవకాశం

 దక్కుతుంది. కాంచన సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు వస్తూ ఎంతో ఆదరణను సొంతం చేసుకుంటున్నాడు. అయితే లారెన్స్ గతంలో తీసుకువచ్చిన కాంచన సినిమా ఎంతటి బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక ఈ సినిమా మంచి విజయాన్ని అందుకోవడంతో ప్రతి ఏడాది కాంచన 2 కాంచన 3 వంటి సినిమాలు చేస్తూ ప్రేక్షకుల్లో మరింత గుర్తింపును సంపాదించుకుంటున్నాడు. అయితే ఇటీవల కాంచన 4 కూడా ఉండబోతోంది అంటూ అధికారిక ప్రకటన చేశారు చిత్ర బృందం. ఇకపోతే

 గత కొద్దిరోజుల నుండి ఈ సినిమాకి సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది. అది ఏంటంటే.. ఈ సినిమాలో స్టార్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తున్నట్లు ఓ వార్త సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది.అయితే తాజాగా ఈ సినిమా గురించి వస్తున్నరూమర్స్ పై మొదట కొరియోగ్రాఫర్ గా తన కెరియర్ను ప్రారంభించిన రాఘవ లారెన్స్  స్పందించారు.హీరోయిన్ మృణాల్ ఠాకూర్ ఈ సినిమాలో నటిస్తున్నట్లు వస్తున్న వార్తలు అవాస్తవం.అలాంటివి అస్సలు నమ్మొద్దు. కాంచన 4లో నటించే నటీనటుల వివరాలను రాఘవేంద్ర ప్రొడక్షన్‌ ద్వారా అధికారికంగా వెల్లడిస్తామని త్వరలోనే ఈ సినిమాకు సంబందించిన వివరాలు తెలియజేస్తామని లారెన్స్ తన సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ చేశారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: