రవితేజ 75 నుండి అదిరిపోయే అప్డేట్..!?

Anilkumar
మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. ఇటీవల ధమాకా సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న రవితేజ ఆ తర్వాత రెండు మూడు సినిమాలు చేసినప్పటికీ అవి ధమాకా స్థాయిలో సక్సెస్ అవ్వలేకపోయాయి. అందులో భాగంగానే ఇప్పుడు వస్తున్న సినిమాతో అయిన బ్లాక్ బస్టర్ సాధించాలి అని నా నా విధాలుగా ప్రయత్నిస్తున్నాడు మాస్ మహారాజా రవితేజ. ఈ క్రమంలోనే ప్రస్తుతం ఆయన హరిష్ శంకర దర్శకత్వంలో మిస్టర్ బచ్చన్ అనే సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమాకి

 సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. అలాగే ఈ సినిమాలో భాగ్యశ్రీ బోర్స్  హీరోయిన్గా కనిపించబోతోంది. అయితే ఈ సినిమా తర్వాత మాస్ మహారాజా రవితేజ మరొక డైరెక్టర్ తో కూడా సినిమా చేయబోతున్నాడు అన్న వార్తలు ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి.  అలాగే భాను భోగవరపు తో మరొక సినిమా చేయడానికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు రవితేజ. అయితే ఇప్పుడు సామజ వరగమన సినిమాతో తన రైటింగ్ టాలెంట్ ఏంటో రవితేజ కి చూపించిన భాను రవితేజతో సినిమా చేసే అవకాశాన్ని కొట్టేసినట్లుగా

 తెలుస్తోంది. కథని కూడా భాను సిద్ధం చేసినట్లుగా వార్తలు వినబడుతున్నాయి. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ కూడా స్టార్ట్ చేయబోతున్నట్లుగా వార్తలు వినబడుతున్నాయి. ఇకపోతే మాస్ మహారాజా రవితేజ   కెరియర్ లో 75వ సినిమా గా వస్తున్న ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మాస్ మహరాజ్ రవితేజ సినిమాల లైంప ఫ్యాన్స్ ని సర్ ప్రైజ్ చేస్తుంది. మిస్టర్ బచ్చన్ ఇంకా పూర్తి కాకుండానే మరో రెండు సినిమాలు చేయడం మాస్ రాజా ఫ్యాన్స్ కి కిక్ ఇస్తుంది. రవితేజ మార్క్ మాస్ ఎంటర్టైనర్స్ గా ఈ సినిమాలు రానున్నాయి..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: