అందుకే ఆ సినిమాకి చాలా తక్కువ రెమ్యూనరేషన్ తీసుకున్న.. విజయ్ సేతుపతి..!?

Anilkumar
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి ప్రస్తుతం భాషతో సంబంధం లేకుండా వరుస సినిమా చేస్తూ బిజీగా ఉన్నాడు. తన విలక్షణమైన నటనతో ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్నాడు. కేవలం హీరో గానే కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా విలన్గా హీరోగా కూడా వరుస సినిమాలు చేస్తూ ఉంటాడు. తనకి వచ్చినా క్యారెక్టర్ తనకి నచ్చితే చాలు అది ఇంపార్టెంట్ రోలా కాదా అన్నది కూడా పట్టించుకోకుండా చిన్న సినిమా అయినా చేసేస్తాడు ఈ నటుడు. అయితే గతంలో దర్శకుడు బుచ్చిబాబు దర్శకత్వంలో వచ్చిన ఉప్పెన సినిమా అందరికీ గుర్తుండే

 ఉంటుంది. ఇక అప్పట్లో విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్గా చేసిన బుచ్చి బాబు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా చూసి అందరూ షాక్ అయ్యారు. ఇకపోతే ఈ సినిమాలో మెగా హీరో వైష్ణవ్ తేజ్ హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. మొదటి సినిమాతోనే స్టార్ హీరోల లిస్టులోకి చేరిపోయాడు ఈ యంగ్ హీరో. అలాగే క్యూట్ బ్యూటీ కృతి శెట్టి సైతం ఈ సినిమాతోనే తెలుగు తెరకు పరిచయమై మొదటి సినిమాతోనే ఈ ముద్దుగుమ్మ సైతం ఓవర్ నైట్

 స్టార్ హీరోయిన్ అయిపోయింది. అంతేకాదు ఈ సినిమా తర్వాత సినిమాల్లో చేసే అవకాశాలు కూడా దక్కాయి. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా గురించి విజయ్ సేతుపతి ఆసక్తికర విషయాలు తెలియజేసారు.సినిమా పట్ల డైరెక్టర్ బుచ్చిబాబుకు ఎంతో ప్యాషన్ వుంది.ఆయన కోసమే ఉప్పెన సినిమా చేశాను అని విజయ్ సేతుపతి తెలిపారు.సాధారణంగా నాలాంటి నటులు తండ్రి పాత్ర చేయడానికి ముందుకు రారు.కానీ అతడు కథ చెప్పే విధానం ,అలాగే డైలాగ్స్ రాసుకున్న పద్ధతి నాకు బాగా నచ్చాయి.అందుకే ఆ పాత్ర చేశాను.అలాగే బుచ్చి బాబు కొత్త దర్శకుడు కావడంతో ఆ సినిమాకు చాల తక్కువ రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు విజయ్ సేతుపతి తెలిపారు..!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: