మెగా ఫ్యాన్స్ కి మరో గుడ్ న్యూస్.. గేమ్ చేంజర్ విషయమేనా..!?

Anilkumar
టాలీవుడ్ తెలుగు సినీ ఇండస్ట్రీలో మెగా కుటుంబానికి ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. అందులో మెగాస్టార్ చిరంజీవి స్టార్ హీరోగా కొనసాగుతున్న నేపథ్యంలోనే ఆయన కొడుకు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆయన చేసిన త్రిబుల్ అర్ తో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ క్రేజ్ ఇప్పుడు గ్లోబల్ స్థాయిలోకి చేరింది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. మెగా పవర్ స్టార్ రాంచరణ్ తండ్రి కూడా ఆయన సంగతి మనందరికీ తెలిసిందే. క్లీన్ కారా పుట్టిన తర్వాత నుండి మెగా కుటుంబానికి బాగా

 కలిసి వచ్చింది అని చెప్పాలి. గత కొంత కాలం నుండి మెగా కుటుంబం వరుసగా శుభవార్తలు చెప్పుకొస్తున్నారు. మొదటిగా వరుణ్ తేజ్ పెళ్లి చేసుకోవడం ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవికి పద్మ విభూషణ్ రావడం ఆ తర్వాత సురేఖ తన కొత్త కిచెన్ అదే అత్తమ్మ కిచెన్ అంటూ ఒక వ్యాపారం మొదలు పెట్టడం ఆ తర్వాత కూడా ఎన్నెన్నో శుభకార్యాలను జరుపుకుంటూ వస్తున్నారు. ఇందులో భాగంగానే ఇటీవల పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సైతం పిఠాపురం నియోజకవర్గంలో భారీ మెజారిటీతో గెలుపొందారు. తాజాగా ఇప్పుడు మరొక వార్తా సోషల్

 మీడియా వేదికగా వైరల్ అవుతుంది. అది ఏంటంటే మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. అందులో గేమ్ చేంజర్ సినిమా సైతం ఒకటి. తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా భారీ బడ్జెట్ తో వస్తోంది. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ కియార నటిస్తోంది. ఇకపోతే ఈ సినిమా పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో ఫ్యాన్ ఇండియా లెవెల్ లో విడుదల కాబోతోంది. అయితే ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించిన ఒక వార్త తెగ వినబడుతుంది. అది ఏంటంటే ఇందులో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ద్విపాత్రాభినయం చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇందులో తండ్రీ కొడుకుల పాత్రలో కనిపించబోతున్నాడు. ఇక తండ్రి పాత్రలో రామ్ చరణ్ ఇరగదీసేసినట్లు గా తెలుస్తోంది .ఇటీవల తండ్రి పాత్రకి సంబంధించిన షూటింగ్ కూడా కంప్లీట్ అయినట్లుగా తెలుస్తోంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: