నెక్స్ట్ రాజకీయాల్లోకి రాబోయే.. సీనియర్ హీరో అయనేనట తెలుసా?

praveen
సినిమా ఇండస్ట్రీలో స్టార్లుగా ఎదిగి ఇక ఆ తర్వాత రిటైర్మెంట్ సమయంలో రాజకీయాల్లోకి వెళ్లి ప్రజాసేవ చేయాలనుకున్న సినీ సెలబ్రిటీలు చాలామంది ఉన్నారు. నాటి ఎన్టీఆర్ దగ్గర నుంచి మొన్న పవన్ కళ్యాణ్ వరకు ఎంతోమంది ఇలా రాజకీయాల్లోకి వెళ్లారు. ఇలా పాలిటిక్స్ లోకి వెళ్ళిన వారిలో కొంతమంది సూపర్ సక్సెస్ అయి పేరు ప్రఖ్యాతలు గడిస్తే.. మరి కొంతమంది మాత్రం రాజకీయాలకు ఇమాడలేక చివరికి పాలిటిక్స్ నుంచి తప్పుకున్న వారు కూడా ఉన్నారు అని చెప్పాలి.

 అయితే ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతున్న సమయంలోనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఏదో ఒక పార్టీలో చేరకుండా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఎజెండాను ఏర్పరచుకొని   జనసేన పార్టీని స్థాపించి ప్రజల్లోనే ఉన్నారు  ఇక ఎన్నికల్లో తనని ప్రజలు దారుణంగా ఓడించిన ప్రజల సమస్యల కోసం పోరాడుతూ వచ్చారు. దీంతో ఇక ఆయన పోరాటపటిమను  అర్థం చేసుకున్న ప్రజలు ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 21 స్థానాలకు గాను 21 చోట్ల విజయం అందించారు. ఇలా పవన్ కళ్యాణ్ అద్భుతమైన విజయం సాధించి పొలిటికల్ హిస్టరీలోనే గేమ్ చేంజర్ గా  నిలిచిపోయాడు.

 ఇక ఇప్పటికే నందమూరి బాలకృష్ణ అటు టిడిపి నుంచి హిందూపురం ఎమ్మెల్యేగా కొనసాగుతూ ఉన్నాడు అన్న విషయం తెలిసిందే. ఈసారి బాలకృష్ణకు మంత్రి పదవి కూడా దక్కే అవకాశం ఉంది అని అందరూ చర్చించుకుంటున్నారు  ఇదిలా ఉంటే ఇక టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి రాజకీయాల్లోకి రాబోయే నెక్స్ట్ సినీ సెలబ్రిటీ ఎవరు అనేది ఆసక్తికరంగా మారిపోయింది. అయితే గతంలోనే ఓసారి పవన్ కళ్యాణ్ లాగే ప్రజారాజ్యం పార్టీని స్థాపించి ఇక రాజకీయాల్లోకి వచ్చిన చిరంజీవి ఇక్కడ ఇమాడ లేక తనకు కలిసి వచ్చిన సినిమాల్లోకి వెళ్లి అక్కడే తన పని తాను చేసుకుంటున్నారు. ఇప్పట్లో ఆయన మళ్లీ రాజకీయాల్లోకి వచ్చే అవకాశం మాత్రం లేదు. దీంతో నాగార్జున, వెంకటేష్ పైనే  అందరి దృష్టి ఉంది. నాగార్జున ఎప్పటికీ ఇండస్ట్రీలో ఉంటారు  అది అందరికి తెలుసు  అయితే వెంకటేష్ రాజకీయాల్లోకి రాబోతున్నాడు అన్న వార్త వైరల్ గా మారింది. ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల్లో అటు తెలంగాణలో మరోవైపు ఆంధ్రలో కూడా తన బంధువులకు సపోర్ట్ చేస్తూ ఏకంగా ప్రచారం కూడా నిర్వహించారు వెంకటేష్. దీన్ని బట్టి చూస్తే.. ఆయనకు రాజకీయాలపై ఇంట్రెస్ట్ ఉందని.. మరికొన్ని రోజుల్లో ఆయన కూడా ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాబోతున్నాడు అనే ప్రచారం జరుగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: