మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న తమిళ నటుడు: సిద్ధార్థ

Anilkumar
బాయ్స్ సినిమాతో తెలుగు ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టాడు తమిళ్ నటుడు సిద్ధార్థ. ఇక ఆయన మొట్ట మొదటి సినిమా తోనే సూపర్ హిట్ విజయాన్ని అందుకొని వరస సినిమాలు చేసే ఛాన్స్ ను అందుకున్నాడు నటుడు సిద్ధార్థ . ఆయన ఎన్నో హిట్  సినిమాలు చేసి తన ఖాతాలో వేసుకున్నాడు. గతేడాది "చిన్నా" సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకొని  తన ఖాతాలో వేసుకున్నాడు. ఇదిలా ఉంటే తాజాగా  తమిళ్ నటుడు సిద్ధార్థ కొత్త సినిమా ప్రాజెక్టును అనౌన్స్ చేశాడు.

 ఆయన "మిస్ యు" సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు  తమిళ్ నటుడు సిద్ధార్థ . కలథిల్ సంతిప్పోమ్‌, మాప్లా సింగం దర్శకత్వంలో వచ్చిన ఫేమ్‌ ఎన్‌. రాజశేఖర్‌ ఈ సినిమాను తెరకెక్కించబోతున్నాడు. ఇక ఈ సినిమాలో సిద్ధార్థ కి జోడిగా ఆషికా రంగనాథ్ నటిస్తోంది. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ ను ప్రముఖ నటుడు శివ కార్తికేయన్ రిలీజ్ చేశాడు. ఇక ఆ పోస్టర్లో  తమిళ్ నటుడు సిద్ధార్థ   రైల్వే స్టేషన్ నుంచి వస్తున్నట్లుగా ఉంది. ఈయన ఎన్నో రోజుల తర్వాత ఈ పోస్టర్లో ప్రేక్షకులకు చాలా

 కొత్తగా కనిపించాడు  తమిళ్ నటుడు సిద్ధార్థ ఇక ఈ సినిమాను 7 మైల్స్ పర్ సెకండ్ ప్రొడక్షన్ బ్యానర్ పై శామ్యూల్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అంతేకాకుండా ఈ సినిమాకి జిబ్రాన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. దానితోపాటు కరుణాకరన్, సాస్తిక రాజేంద్రన్, బాల తదితరులు పలు కీలక పాత్రలలో నటిస్తున్నారు. ఇక ఈ సినిమాతో  తమిళ్ నటుడు సిద్ధార్థ మరో హిట్ మూవీని తన ఖాతాలో వేసుకుంటాడో లేదో చూడాలి. ఇక ఆ పోస్టర్ ద్వారా అభిమానులకు ఈ సినిమాపై మరింత అంచనాలు పెరిగాయి. ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఎంతటి కాసుల వర్షాన్ని కురిపిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: