ఏవండోయ్.. కల్కి ట్రైలర్ లో ఇది గమనించారా?

praveen
భారత సినీ ప్రేక్షకులు అందరూ కూడా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న కల్కి ట్రైలర్ ఇటీవల విడుదలైంది. అయితే ట్రైలర్ విడుదలకు ముందే ఎన్నో అంచనాలను క్రియేట్ చేసిన ఈ మూవీ..  ట్రైలర్ విడుదల తర్వాత అంచనాలను రెట్టింపు చేసింది అని చెప్పాలి. ఎందుకంటే నాగ్ అశ్విన్ హాలీవుడ్ మూవీ ని తలదన్నే రేంజ్ లో ఇక కల్కి సినిమాను తెరకెక్కిస్తున్నాడు అన్న విషయం ట్రైలర్ చూసిన తర్వాత అర్థమవుతుంది. అయితే ఈ ట్రైలర్ లో నాగ్ అశ్విన్ సినిమా యొక్క కథ నేపథ్యం ఏంటి అన్న విషయాన్ని చెప్పడమే కాకుండా ఆడియన్స్ కి చాలానే చిక్కుముడులు కూడా వదిలిపెట్టాడు.

 ఒకరకంగా చెప్పాలంటే కల్కి ట్రైలర్ చూసిన తర్వాత సినీ ప్రేక్షకులందరికీ మైండ్ ఒక్కసారిగా వేడెక్కిపోయింది అని చెప్పాలి. ఈ సినిమాలో ప్రభాస్ పాత్ర ఎంతో లైటర్ వే లో ఉంటుంది అనే విషయాన్ని చెప్పకనే చెప్పేసాడు డైరెక్టర్. ఇక ఎవరు హీరో ఎవరిది కీలకపాత్ర అన్న విషయాన్ని కూడా ట్రైలర్లో క్లారిటీ ఇచ్చాడు  ప్రపంచంలో గాలి నీరు ఆహారం స్వచ్చంగా పుష్కలంగా ఉన్న కాంప్లెక్స్ లోకి వెళ్లాలి అనేది బైరవ కోరిక. అందుకోసం బౌంటి హంటర్ గా మారి తనకు వచ్చిన కాంట్రాక్టులను పూర్తి చేసి సొమ్ము చేసుకుంటూ ఉంటాడు. ఇలాంటి సమయంలోనే అతనికి వచ్చిన ఒక డీల్ జీవితాన్నే మార్చేస్తుంది. అసలు యుద్ధంలోకి అప్పుడే అడుగు పెడతాడు.

 ఇక ఇందులో మరో నలుగురివి కీలక పాత్రలు. అదే అశ్వత్థామ, రెండు దీపిక పదుకొనే, మూడు కమలహాసన్. 4 కల్కి. అశ్వత్థామ పాత్ర పుట్టబోయే కల్కిని కాపాడటమే. దీపిక పదుకొనే తన బిడ్డకు జన్మనివ్వడం కమల్ హాసన్ ఇక ఇలా దీపిక పదుకొనే బిడ్డను పొందాలి అనుకోవడం. కమల్ పాత్ర కూడా సామాన్యుడిలా కనిపించట్లేదు. పురాణాల్లోని ఏదో ఒక పాత్ర అయ్యే అవకాశం ఉంది అన్నది తెలుస్తుంది. కల్కి కి ఉండే శక్తుల వల్ల అతను మంచి వాళ్ల చేతుల్లో పడితే లోక కళ్యాణం. చెడ్డవాళ్ల చేతుల్లో పడితే విశ్వనాశనం జరుగుతుందని.. ఒక కాన్సెప్ట్ అర్థమయ్యేలా చేశాడు డైరెక్టర్. ఇలా మంచి, చెడుల మధ్య జరుగుతున్న యుద్ధమే కలకీ సినిమా అని చెప్పకనే చెప్పాడు. ఇలా ఇటీవల విడుదలైన కల్కి ట్రైలర్ లో ఇవన్నీ చూపించేశాడు. డైరెక్టర్ నాగ్ అశ్విన్. మరి మీరు ఇది గమనించారా.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: