ఒకరోజు కూడా గ్యాప్ ఇవ్వకుండా నెక్స్ట్ సినిమా స్టార్ట్ చేసిన శర్వానంద్..!?

Anilkumar
ఒక్కరోజు కూడా వాళ్ల కెరీర్ లో గ్యాప్ ఇవ్వరు కొంతమంది హీరోలు. వాళ్లు ఎవరో కాదు రామ్, శర్వానంద్, గోపీచంద్ లాంటి చాలామంది ఈ లిస్టులో ఉన్నారు ఇప్పుడు తాజాగా ఈ లిస్టులోకి శర్వానంద్ కూడా చేరారు. ఇక ఆయన తాజాగా మనమే సినిమా లో హీరోగా నటించిన సంగతి తెలిసిందే. ఈ మూవీ శుక్రవారం రోజున థియేటర్లలోకి వచ్చింది. అప్పటివరకు ప్రచారంలో భాగంగా బిజీగా గడిపిన శర్వానంద్ తన సినిమా రిలీజ్ అయిన రోజే మరో సినిమా సెట్స్ లో అడుగుపెట్టాడు. ఈ హీరో తన తదుపరి ప్రాజెక్టులను రామ్ అబ్బరాజు దర్శకత్వంలో చేయబోతున్నాడు. ఈ సినిమాకు

 సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ హైదరాబాదులో స్టార్ట్ కాబోతోంది.  ఈ చిత్రంలో శర్వానంద్, సంయుక్త మీనన్ ఇద్దరి పై కొన్ని సన్నివేశాలను తెరకెక్కించబోతున్నాడు దర్శకుడు. ఇక ఈ సినిమాలో ఇద్దరు కీలకమైన హీరోయిన్లను సెట్స్ పైకి వచ్చారు. ఈ సినిమాలో మరో హీరోయిన్ గా సాక్షి వైద్య చేస్తుంది. ఆమె ఏజెంట్ సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకొని ఎంతో గుర్తింపును తెచ్చుకున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ చిత్రాన్ని ఏకే ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్నారు. విశాల్

 చంద్రశేఖర్ ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ ప్రాజెక్టుకి సంబంధించిన మరికొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు త్వరలోనే తెలుస్తాయి. శర్వానంద్ ఒకే ఒక జీవితం సినిమాతో మంచి సక్సెస్ నీ అందుకున్నాడు. ఈ చిత్రానికి ముందు ఆయన వరుస ఫ్లాప్ లను అందుకునపటికి ఆ తర్వాత ఒకే ఒక జీవితం సినిమాతో సూపర్ హిట్ విజయాన్ని అందుకున్నాడు శర్వానంద్  . ఇక ఆ సినిమా   సక్సెస్ తన లైఫ్ లో కూడా అలానే కొనసాగించాలని ఉద్దేశంతో శర్వానంద్  బ్యాక్ టు బ్యాక్ మూవీస్ చేస్తున్నాడు. ఇక ఆయన నటించిన సినిమా తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి రెస్పాన్స్ ను అందుకుంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: