వరుణ్ తేజ్ మట్కా మూవీ షూటింగ్ నుండి అదిరిపోయే అప్డేట్..!?

Anilkumar
ఫిదా సినిమాలో భారీ విజయాన్ని అందుకున్నాడు వరుణ్ తేజ్. ఆ తర్వాత వరుస సినిమాలు చేసి సూపర్ హిట్ సినిమాలు తన ఖాతాలో వేసుకున్నాడు. ఆ తర్వాత లావణ్య త్రిపాఠినీ అందరి సమక్షంలో ప్రేమ వివాహం చేసుకొని తన జీవితాన్ని కొనసాగిస్తున్నాడు.  ఈయన తాజాగా మట్కా మూవీ లో హీరోగా నటిస్తున్నాడు.  ఈ సినిమా నుంచి ఒక అప్డేట్ బయటకు వచ్చింది అదేంటంటే. పలాస ఫేమ్  కరుణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కబోతున్న ఈ సినిమా జూన్ 19

 నుంచి కొత్త షెడ్యూల్ ప్రారంభం కాబోతుంది. ఎస్ఆర్టీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ వారు ఈ చిత్రాన్ని బ్యానర్స్ పై ఎక్కియగా రజని తాళ్లూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ కోసం ప్రస్తుతం హైదరాబాదులోని రామోజీ ఫిలిం సిటీ లో సెట్స్ నిర్మిస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ చిత్రంలో వరుణ్ తేజ్ 4 డిఫరెంట్ క్యారెక్టర్స్ లలో ప్రేక్షకులను అలరించబోతున్నాడు. యావత్ దేశాన్ని కదిలించిన ఒక యదార్ధ ఘటన ఆధారంగా ఈ పిరియాడికల్

 సినిమాని తెరకెక్కిస్తున్నారు . ఇదిలా ఉంటే వరుణ్ తేజ్ బర్త్డే సందర్భంగా ఈ చిత్రం నుండి ఒక గ్లీప్స్ ను విడుదల చేశారు మేకర్స్. ఆ గ్లీప్స్ ద్వారా ప్రేక్షకుల దగ్గర నుంచి మంచి స్పందన వచ్చింది. ఇక ఈ సినిమాలో నవీన్ చంద్రర, రవి శంకర్ వంటి టాలెంటెడ్ ఆర్టిస్టులు పలు కీలక పాత్రలలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్ గా కెసిఆర్ కుమార్ చేస్తుండగా జీవి ప్రకాష్ కుమార్ ఈ చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు.  తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ వంటి అనేక భాషలలో ఈ సినిమా విడుదల కానుంది. ఇక ఈ చిత్రంలో ప్రిన్స్ వరుణ్ తేజ్ కు జంటగా నోరా ఫతేహి, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించనున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: