భారతీయుడు 2 లో రకుల్ పాత్ర ఎలా ఉండబోతుందంటే..!?

Anilkumar
వెంకటాద్రి ఎక్స్ప్రెస్ సినిమాతో రకుల్ తెలుగు సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన విషయం అందరికీ తెలిసిందే. తన మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకుంది. తన నటన, అందం ,ఎక్స్ప్రెషన్స్ తో ఎంతో  క్రేజ్ను సొంతం చేసుకుంది. ఇక దాని తర్వాత ఎన్నో హిట్ అండ్ ఫ్లాప్ సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది. అంతేకాకుండా రకుల్ ఎన్నో హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంది.   ఈ ముద్దుగుమ్మ దాదాపుగా తన అన్ని సినిమాలను యంగ్ హీరోలతోనే నటించే అవకాశాన్ని దక్కించుకుంది.  ఈ బ్యూటీ కొండపాలెం సినిమా చేసిన తర్వాత తెలుగు ఇండస్ట్రీకి

 కాస్త గ్యాప్ తీసుకుంది.  హిందీ సినిమాలో అడుగుపెట్టి ఆమె అక్కడ ఆశించిన స్థాయిలో విజయం అందుకోలేకపోయింది.ఇక ఇది కాసేపు పక్కన పెడితే ఈ ముద్దుగుమ్మ మరోసారి  తన సత్తాను చాటేందుకు సిద్ధమైంది.  భారతీయుడు 2 లో మళ్లీ ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమవుతోంది రకుల్ ప్రీత్ సింగ్. ఇక ఈ చిత్రం శంకర్ దర్శకత్వంలో తెరకెక్కబోతున్న విషయం అందరికీ తెలిసిందే. హీరో కమల్ హాసన్ నటిస్తున్న ఈ మూవీ షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఇక ఈ సినిమాలో రకుల్ తన పాత సినిమాల కంటే ఈ సినిమాలో చాలా భిన్నంగా ఉంటుందని

 ఆత్మవిశ్వాసం కలిగి ఉన్న అమ్మాయిగా కనిపిస్తానని చెప్పుకొచ్చింది. ఇదిలా ఉంటే రకుల్ ప్రీత్ సింగ్ తాజాగా సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేసింది. అదేంటంటే "ఈ సినిమా ప్రయాణం చేస్తున్నన్ని రోజులు నేను చేసిన రోల్  నా నిజజీవితానికి దగ్గరగా ఉందనే భావన కలిగివుంది. అంతేకాకుండా భారతీయుడు సీక్వెల్ కు సంబంధించిన విషయాలను వెల్లడించడానికి చాలా ఉత్సాహంగా ఉన్నాను కానీ దానికి సంబంధించిన విషయాలు ఇప్పుడు ఏం చెప్పలేనని.    దర్శకుడు శంకర్ తో కలిసి పని చేయడం నాకు ఎంతో ఆనందంగా ఉందని చెప్పుకొచ్చింది.  ఈ సినిమాలో కాజల్,సిద్ధార్థ్‌లు కూడా పలు కీలక పాత్రలలో నటిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: