ఏంటి.. గేమ్ చేంజర్ లో రామ్ చరణ్ పాత్ర అలా ఉండబోతుందా..!?

Anilkumar
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తాజాగా గేమ్ చేంజర్ సినిమా చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కబోతుంది. ఇక చిత్రంలో రాంచరణ్ 2 పాత్రలను పోషిస్తున్నాడు.  ఈ మూవీలో ఆయన తండ్రి కొడుకులలాగా నటిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. దీని గురించి గతంలో వార్తలు కూడా వచ్చాయి. గతంలో కొడుకు పాత్ర పేరు రామ్ నందన్ అని కూడా విడుదల చేశారు. అయితే ఇప్పుడు తాజాగా తండ్రి పేరును రిలీజ్ చేశారు. ఇక తండ్రి పేరు ఏంటంటే "అప్పన్న" అని తెలుస్తుంది. అయితే ఫ్లాష్ బ్యాక్ లో ఈ పాత్ర వస్తుందని తాజా సమాచారం.

 అంతేకాకుండా ఈ క్యారెక్టర్ కి సంబంధించిన ఫోటోలు కూడా గతంలో లీక్ అయ్యాయి. అయితే రామ్ చరణ్ అన్నప్పగా ఆహార్య, అభినయం కొత్తగా ఉంటుందట. మరో విషయం ఏంటంటే...  ఈ పాత్రకు నత్తి కూడా ఉంటుందని తెలుస్తోంది.  ఈ సమస్య చిత్రంలో కీలకమైన పాత్రగా ఉంటుందట. అయితే ఈ సినిమాలో తండ్రి ఆశయాన్ని కొడుకు ఎలా నిజం చేస్తాడు అనేదే ఈ కథలో ప్రధాన ఇతివృత్తమని తెలుస్తోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో శరవేగంగా జరుగుతోంది. అయితే కీలకమైన ఈ షెడ్యూల్తో ఈ సినిమా షూటింగ్ మొత్తం

 పూర్తవుతుండట. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమా  లో అంజలి,  అద్వాని హీరోయిన్లుగా నటిస్తుండగా శ్రీకాంత్ ,ఎస్ జె సూర్య, సునీల్  పలు కీలక పాత్రలలో నటిస్తున్నారు. అంతేకాకుండా ఈ సినిమాకి తమన్ అద్భుతమైన సంగీతాన్ని అందిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఇదిలా ఉంటే ఆర్ఆర్ఆర్ సినిమా ద్వారా బ్లాక్ బస్టర్ అందుకున్నాడు రామ్ చరణ్.  ఆ సినిమా తర్వాత రామ్ చరణ్ ప్రేక్షకులను అలరించేందుకు గేమ్ చేంజ్ సినిమాతో తెరమీదికి వస్తున్నాడు. ఇక ఈ సినిమాతో ఈయన ఎంతటి విజయాన్ని అన్నదుకుంటాడో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: