ఆ విషయంలో పేరెంట్స్ మాట కూడా వినకుండా ఆ పని చేసిన సమంత..!?

Anilkumar
 "ఏమాయ చేసావే" సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది సమంత. ఇక ఆమె నటించిన మొట్టమొదటి సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకోవడంతో వరుస సినిమాలో చేస్తూ దూసుకుపోయింది. తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకుంది సమంత. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప పార్ట్ వన్ సినిమా ఎంతటి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుందో అందరికీ తెలిసిందే. ఆ సినిమాలో ఈ ముద్దుగుమ్మ ఐటెం సాంగ్ వేసి ఎంతో క్రేజ్ ను సొంతం చేసుకుంది. ఉ అంటావా    ఊఊ అంటావా అనే పాటకు డాన్స్ చేసి దుమ్ము

 రేపింది సమంత. దేవి శ్రీ ప్రసాద్ సాంగ్ కి సమంత చేసిన డాన్స్ పెర్ఫార్మెన్స్ కు పర్ఫెక్ట్ గా మ్యాచ్ అయింది. సమంత ఆ సాంగ్ వేయడం వల్ల అక్కినేని ఫ్యాన్స్ నుంచి ఎన్నో ట్రోల్స్ వచ్చాయి. నాగచైతన్యతో సమంత అప్పుడే డైవర్స్ తీసుకుని పుష్ప సినిమాలో ఆ రేంజ్ లో ఆమె రెచ్చిపోవడం అక్కినేని ఫ్యాన్స్ డైజెస్ట్ చేసుకోలేకపోయారు. ఆ మూవీలో సమంత ఆ పాటకి డాన్స్ చేయడం ఆ సినిమాకు ఎంతో హెల్ప్ అయింది. ఇక ఆమె ఆ పాటను ఎంచుకోవడం తన సొంత నిర్ణయం అని తెలుస్తోంది. ఇక ఆమె ఆ సమయంలోనే డైవర్స్ తీసుకుని

 ఉండడం దాని తర్వాత అలాంటి సాంగ్ చేయడం వాళ్ల  పేరెంట్స్ కూడా వద్దని అన్నారట. అయినా సమంత మాట వినకుండా ఆమె ఆ సాంగ్ ద్వారా తన గ్లామర్ రోల్ లో ఏమాత్రం వెనక్కి తగ్గేదే లేదని  ప్రూఫ్ చేసుకుంది.  నేను ఆ సాంగ్ చేయకుండా ఉండాల్సింది అని ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పింది సమంత. ఇక నాగచైతన్యకు డైవర్స్ ఇచ్చి పుష్ప సాంగ్ చేయడం వల్ల ప్రేక్షకులు షాక్ అయ్యేలా చేసింది ఈ ముద్దుగుమ్మ. ఇదిలా ఉంటే పుష్ప 2  సినిమాలో కూడా సమంతని   ఒక స్పెషల్ సాంగ్ చేయమని ఆఫర్ ఇస్తున్నారట. కానీ సమంత మాత్రం నో చెబుతుందని తెలుస్తోంది.  చూడాలి పుష్ప 2 సినిమాలో సమంత స్పెషల్ సాంగ్ ఉండబోతుందో లేదో అనేది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: