బాలయ్య, బాబి మూవీ నుండి క్రేజీ అప్డేట్..!?

Anilkumar
నటసింహ నందమూరి బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. భగవంత్ కేసరి సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకొని మరింత క్రేజ్ ను సొంతం చేసుకున్నాడు. తాజాగా యంగ్ డైరెక్టర్ బాబి దర్శకత్వంలో బాలకృష్ణ ఎన్.బి.కె 109 సినిమా చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఇక ఈ చిత్రాన్ని బాబి బిగ్గెస్ట్ యాక్షన్ మూవీగా తెరకెక్కిస్తున్నాడు. నాగ వంశీ, సౌజన్య ఈ చిత్రాన్ని ఏంతో గ్రాండ్ గా నిర్మిస్తుండగా శ్రీకర స్టూడియోస్ సమర్పణలో, సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్ట్యూన్ ఫోర్ ఈ మూవీ ని బ్యానర్స్ పై ఎక్కిస్తున్నారు. అయితే

 ఇందులో విలన్ గా బాలీవుడ్ స్టార్ బాబి డియోల్ నటిస్తుండగా చాందిని చౌదరి సినిమాలో పలు కీలక పాత్రలు నటిస్తోంది. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఈ సినిమాకు అద్భుతమైన మ్యూజిక్ ను అందిస్తున్నాడు. అయితే బాబి ఈ సినిమాలో బాలయ్య బాబుని ఎంతో స్టైల్ గా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నాడు. ఇదిలా ఉంటే ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన వీడియో, గ్లింప్సె ప్రేక్షకుల ముందుకు వచ్చి ఈ సినిమాపై మరింత అంచనాలు పెరిగిపోయేలా చేశాయి. ఇక చిత్రంలో బాలయ్య మాస్ డైలాగ్స్ అభిమానులను

 ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఇది కాసేపు పక్కన పెడితే జూన్ 10న బాలయ్య పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుండి ఒక స్పెషల్ గ్లింప్సె ని రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇక ఆ వీడియో ప్రేక్షకుల ముందుకి వచ్చేసింది. ఇక వీడియో ఏంటంటే......"దేవుడు చాలా మంచోడయ్యా.. దుర్మార్గులకు కూడా వరాలు ఇస్తాడు.. వీళ్ళ అంతు చూడాలంటే కావాల్సింది జాలి, దయ, కరుణ.. ఇలాంటి పదాల అర్ధమే తెలియని అసురుడు" అనే డైలాగ్ తో బాలయ్య బాబు ఎంట్రీ అదిరిపోతుంది. ఇక ఈ వీడియో బాలయ్య బాబు ఫ్యాన్స్ ని ఎంతగానో ఆకట్టుకుంటుంది. సోషల్ మీడియాలో ఈ వీడియో తెగ వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: