ప్రభాస్ 'కల్కీ'లో విలన్ కమల్ హాసన్ కాదా.. ఎవరో తెలుసా?

praveen
ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన కల్కి మూవీపై ఏ రేంజ్ లో అంచనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సైన్స్ ఫిక్షన్.. ఫ్యూచరిస్టిక్ అనే కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న ఈ మూవీలో ఇక ప్రభాస్ తో పాటు ఎంతో మంది అగ్రతారలు కూడా నటిస్తున్నారు. బాలీవుడ్ నుంచి దీపిక పదుకొనే, దిశ పఠాని లాంటి హీరోయిన్లతో పాటు ఇక బాలీవుడ్ మెగాస్టార్ అమితాబచ్చన్ కూడా కీలకపాత్రలో కనిపించబోతున్నారు. అదే సమయంలో లోకనాయకుడు కమల్ హాసన్ కూడా ఈ సినిమాలో నటిస్తున్నాడు అని చెప్పాలి.

 అయితే కల్కి మూవీలో ప్రభాస్ ను ఢీకొట్టే విలన్ పాత్రలో అటు కమల్హాసన్ నటించిన బోతున్నాడు అంటూ మొదట వార్తలు వచ్చాయి. అయితే ఇటీవల ట్రైలర్ విడుదలైన తర్వాత కమల్ పాత్ర చూసినప్పుడు కూడా ఇది నిజమే అనిపించింది. కానీ ఇక ఈ మూవీలో కమల్ విలన్ పాత్రలో కనిపించడం లేదట. కేవలం కథను కీలక మలుపు తిప్పే  అతిధి పాత్రలో మాత్రమే కనిపించబోతున్నాడు అన్నది తెలుస్తుంది  దీంతో ట్రైలర్లో మోస్ట్ పవర్ఫుల్ గా కనిపిస్తున్న ప్రభాస్ ను ఢీకొట్టే విలన్ పాత్రలో కనిపించబోయే నటుడు ఎవరు అన్నది ఆసక్తికరంగా మారిపోయింది.

 అయితే బెంగాలీ నటుడు శాశ్వత చటర్జీ ఇలా కల్కి సినిమాలో మెయిన్ విలన్ పాత్రను పోషించబోతున్నారు అన్నది తెలుస్తుంది  ఎందుకంటే ఈ బెంగాలీ నటుడు ఇటీవల నాగ్ అశ్విన్ అఫీషియల్ ఇంస్టాగ్రామ్ ఖాతాను ఫాలో అవ్వడం మొదలు పెట్టడంతో.. ఈ వార్తలకి మరింత బలం చేకూరింది. దాదాపు 500 కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను ఇటీవల మొదలుపెట్టారు. కాగా ఈ మూవీ ఈనెల 27వ తేదీన రిలీజ్ కాబోతుంది అన్న విషయం తెలిసిందే. కల్కి సినిమాకు సంబంధించిన ట్రైలర్ అయితే అందరిలో మరింత అంచనాలను పెంచేసింది. హాలీవుడ్ మూవీస్ ని తలదన్నే విధంగా ఈ సినిమాలో యాక్షన్ సీక్వెన్స్ ఉండబోతుంది అని ఈ ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: