కల్కి ట్రైలర్ : ఏంటీ బ్రో.. ఇది తెలుగు సినిమానేనా?

praveen
సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో ఎన్నో సినిమాలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి. కానీ కొన్ని సినిమాలు మాత్రం ప్రేక్షకులకు బాగా దగ్గరవుతూ ఉంటాయి  అంతేకాదు ఏకంగా చిత్ర పరిశ్రమ ఖ్యాతిని పెంచుతూ ఉంటాయి. అలాంటి సినిమాలకు సంబంధించి ఏదైనా మాట్లాడాలంటే మాటలు కూడా సరిపోవేమో అనే భావన కలుగుతూ ఉంటుంది. ఇక ఇప్పుడు ప్రభాస్ నటించిన కల్కి మూవీ ట్రైలర్ చూసిన తర్వాత అందరికీ ఇదే భావన కలుగుతుంది  నాగ్ అశ్విన్ ఎప్పుడు తన సినిమాలతో మ్యాజిక్ చేస్తాడు అన్న విషయం అందరికీ తెలుసు.

 అయితే ఇక ఇప్పుడు ఆ మ్యాజిక్ ని రెట్టింపు చేసి చూపించాడు దర్శకుడు నాగ్ అశ్విన్   ప్రభాస్ లాంటి బడా హీరోని పెట్టుకొని కల్కి 2898 ఏడి అనే సినిమాను తెరకెక్కించాడు  అయితే విడుదల వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమా.. ఈనెల 27వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది. అయితే ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను విడుదల చేశారు. ఈ ట్రైలర్ చూసిన తర్వాత ప్రేక్షకులకు మాటలు రావట్లేదు. అసలు ఈ ట్రైలర్ గురించి ఏం చెప్పాలి. యాక్షన్ బాగుందని చెప్పాలా.. లేకపోతే పంచ్ డైలాగులు అదిరిపోయాయని చెప్పాలా.. ప్రభాస్ ని ఎలా అయితే చూడాలనుకున్నామో అలాగే చూపించారని చెప్పాలా... ఊహకందని రీతిలోఎలివేషన్స్ ఉన్నాయని చెప్పాలా ఇలా ఏం చెప్పాలో మాటలు కూడా రావట్లేదు ట్రైలర్ చూసిన ప్రేక్షకులకు.

 ఎందుకంటే సైన్స్ ఫిక్షన్, ఫ్యూచరిస్టిక్ ఫిలిం గా రూపొందిస్తున్న ఏ మూవీలో ప్రభాస్ యాక్షన్ ఆ రేంజ్ లో ఉంది  ఇక నాగ్ అశ్విన్ డైరెక్షన్ అయితే ఇంకో రేంజ్ లో ఉంది. కాగా ఈ మూవీలో ప్రభాస్ తో పాటు అమితాబచ్చన్, కమల్ హాసన్, దీపిక పదుకొనే, దిశాపటాని లాంటి నటీనటులు నటిస్తున్నారు. అయితే ట్రైలర్లో ప్రభాస్ ని నాగ్ అశ్విన్ చూపించిన తీరు కేవలం డార్లింగ్ అభిమానులకు మాత్రమే కాదు సినిమాలను ఇష్టపడే ప్రతి ప్రేక్షకులకి గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి. నిజంగా ఇది తెలుగు సినిమా నేనా అనే భావన ఇక ఈ ట్రైలర్ చూస్తున్న ప్రతి క్షణం కలుగుతుంది. ట్రైలరే ఇలా ఉందంటే ఇక మూవీ ఎలా ఉంటుందో అని అంచనాలు రెట్టింపు కాదు.  అంతకుమించి అనే లెవెల్ లోనే పెరిగిపోయాయి. ఏదేమైనా కల్కి ఏడి 2898 సినిమాతో నాగ్ అశ్విన్ మరో ప్రపంచంలోకి తీసుకువెళ్లబోతున్నాడు అన్నది స్పష్టంగా అర్థమవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: