పిల్లలతో కలిసి పెళ్లిరోజు సెలబ్రేట్ చేసుకున్న నయన్, విగ్నేష్..!

Anilkumar
తమిళ స్టార్ హీరోయిన్ నయనతార ప్రస్తుతం భాషతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతోంది. అలాగే ఇటీవల సోషల్ మీడియాలో సైతం ఎంట్రీ ఇచ్చింది.  ఒకవైపు సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న నయనతార ఇటు సోషల్ మీడియాలో సైతం చాలా యాక్టివ్ గా ఉంటుంది. తనకి సంబంధించిన ప్రతి ఒక్క అప్డేట్ సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. అలా వరుస సినిమాలతో బిజీగా ఉన్న నయనతార డైరెక్టర్ విగ్నేష్ శివ ను పెళ్లి చేసుకోండి పెళ్లి తర్వాత సరోగసి పద్ధతి ద్వారా ఇద్దరు పిల్లలకూ

 తల్లిదండ్రులు కూడా అయ్యారు ఈ జంట. ప్రస్తుతం ఒకవైపు కెరియర్ మరొకవైపు వ్యక్తిగత జీవితాన్ని కూడా బ్యాలెన్స్ చేస్తోంది నయనతార కాగా ఆదివారం (జూన్ 09) నయన్- విఘ్నేశ్ ల రెండో వివాహా వార్షికోత్సవం. ప్రస్తుతం సమ్మర్ వెకేషన్ లో భాగంగా విదేశాల్లో విహరిస్తోన్న ఈ జంట తమ రెండో పెళ్లి రోజును గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంది. ఈ నేపథ్యంలో నేను నయనతార భర్త విగ్నేష్ తన సోషల్ మీడియా వేదికగా వారి పెళ్లి రోజుకి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ ఎమోషనల్ అయ్యాడు. ఈ మేరకు ఆయన ఆ పోస్ట్

 లో భాగంగా. 'పదేళ్ల నయనతార.. రెండేళ్ల విక్కీ-నయన్. ఇవాళ మా రెండో వివాహా వార్షికోత్సవం. నిన్ను పెళ్లి చేసుకోవడం, ఉయిర్ ఉలగం రావడం నా జీవితంలో అత్యంత గొప్పవిషయం' 'నా భార్య తంగమేయిని నేను ఎంతో ప్రేమిస్తున్నా. నీతో మరెన్నో ఆహ్లాదకరమైన సమయాలు, జ్ఞాపకాలు, మధురమైన క్షణాలు ఎప్పటికీ మర్చిపోలేను. ఎలాంటి పరిస్థితుల్లనైనా నీకు తోడుగా ఉంటా'  'ఆ దేవుడు మనకు ఎల్ల వేళలా అండగా నిలవాలని కోరుకుంటున్నాను. మన ఉయిర్, ఉలగంతో సంతోషంగా ఉండాలనేదే నా కోరిక.  అంటూ పేర్కొన్నారు. దీంతో ప్రస్తుతం నయనతార భర్త షేర్ చేసిన పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: