నాగచైతన్య సినిమాతో రీ ఎంట్రీ ఇస్తున్న స్టార్ హీరో భార్య..!?

Anilkumar
అక్కినేని యంగ్ హీరో నాగచైతన్య ప్రస్తుతం తండేల్ అనే సినిమాతో బిజీగా ఉన్నాడు. చందు మొండేటి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో నాగచైతన్య సరసన సాయి పల్లవి హీరోయిన్గా నటిస్తోంది. గీత ఆర్ట్స్ 2 బ్యానర్ లో బన్నీ వాసు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. ఇకపోతే దీనిని డిసెంబర్ 23న విడుదల చేయాలి అని ఇప్పటికే దర్శక నిర్మాతలు ప్లాన్ కూడా చేశారు. అయితే ఈ సినిమా తరువాత విరూపాక్ష సినిమాతో దర్శకుడిగా భారీ విజయాన్ని అందుకున్న కార్తీక్

 దండు దర్శకత్వంలో నాగచైతన్య మరొక సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా వార్తలు వినబడుతున్నాయి. విరూపాక్ష సినిమాతో డైరెక్టర్గా తను ఏంటో నిరూపించుకున్న కార్తీక్ మరోసారి అలాంటి జానర్ లోనే సినిమా చేయబోతున్నట్లుగా  సమాచారం వినబడుతోంది. ఇకపోతే ఆ సినిమాలో నాగచైతన్య కి జోడిగా పూజా హెగ్డే ను హీరోయిన్గా సెలెక్ట్ చేసినట్లుగా కూడా వార్తలు వినబడుతున్నాయి. కాగా రాదే శ్యామ్  తర్వాత పూజా హెగ్డే తెలుగులో ఒక్క సినిమా కూడా చేయలేదు. ఆ సినిమా తర్వాత పూజ హెగ్డే చేస్తున్న సినిమా ఇదే. గుంటూరు

 కారం సినిమాలో ఆమె హీరోయిన్గా సెలెక్ట్ అయినప్పటికీ కొన్ని కారణాలవల్ల ఈ అమ్మడు గుంటూరు కారం నుండి తప్పకుంది. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ సినిమా కి సంబంధించిన ఒక వార్త ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది. ఈ సినిమాలో నాగ చైతన్య మదర్ రోల్ లో కోలీవుడ్ స్టార్ హీరో వైఫ్ నటిస్తుందని తెలుస్తుంది. తమిళంలో స్టార్ హీరో వైఫ్ జ్యోతిక ఒకప్పుడు హీరోయిన్ గా ప్రేక్షకులను మెప్పించారు. సూర్యతో మ్యారేజ్ తర్వాత సినిమాలకు దూరంగా ఉన్న జ్యోతిక మళ్లీ ఈమధ్యనే స్పెషల్ పాత్రల్లో నటిస్తున్నారు. నాగ చైతన్య కార్తీక్ దండు సినిమాలో చైతన్య మదర్ రోల్ లో జ్యోతిక ని తీసుకున్నట్టు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: