చిరంజీవి, పవన్ కాంబోలో సినిమా డైరెక్టర్ ఎవరంటే..!?

Anilkumar
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మెగా కుటుంబానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఇప్పటికే సినీ ఇండస్ట్రీకి సోలోగా వచ్చి మంచి గుర్తింపును తెచ్చుకున్నారు మెగా హీరోలు. అయితే ఒకప్పుడు చిరంజీవి మాత్రమే టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా పేరు తెచ్చుకున్నాడు. కానీ ఆ తర్వాత మెగా హీరోలుగా వచ్చిన వారందరూ కూడా ఇప్పుడు స్టార్ హీరోలుగా చలామణి అవుతున్నారు. ఎవరి సపోర్ట్ లేకుండా సినిమాల్లోకి విలన్ గా ఎంట్రీ ఆ తర్వాత హీరోగా మారాడు చిరంజీవి. ప్రస్తుతం వరుస

 సినిమాను చేస్తూ బిజీగా ఉన్నా మెగాస్టార్ చిరంజీవి యంగ్ హీరోలకి పోటీగా సినిమాలు చేస్తున్నాడు. ఏడాదికి ఒకటి రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఇక ఇప్పటికే ఆయన చేసిన సినిమాలన్నీ కూడా మంచి విజయాలను అందుకోవడంతో ఆయన సినిమాలపై అంచనాలు భారీ స్థాయికి చేరుకున్నాయి. వరుసగా ఆరు సంవత్సరాల్లో 6 ఇండస్ట్రీ హిట్లను అందుకున్న ఏకైక హీరోగా మంచి పేరు సంపాదించుకున్నాడు చిరంజీవి. అయితే చిరంజీవి తర్వాత సినీ ఇండస్ట్రీకి హీరోగా పరిచయం అయ్యాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.

 ప్రస్తుతం స్టార్ హీరోగా ఉన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చాలా తక్కువ సమయంలోనే కి అన్న తగ్గ తమ్ముడుగా పేరు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం ఆయన స్థాయి నెక్స్ట్ లెవెల్ లో ఉంది. ఇక ఆయన పిఠాపురం నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా కూడా భారీ మెజారిటీతో గెలుపును సాధించాడు. అలా అన్నదమ్ములు ఇద్దరు ప్రస్తుతం తెలుగు సినీ ఇండస్ట్రీని ఏలుతున్నారు అని చెప్పొచ్చు.  అయితే ఇప్పుడు చిరంజీవి పవన్ కళ్యాణ్ ఇద్దరు అన్నదమ్ములను బేస్ చేసుకొని యండమూరి వీరేంద్రనాథ్ ఒక పొలిటికల్ డ్రామా స్టోరీని రాశారట. ఇక ఈ సినిమాలో ఇద్దరు నటిస్తే బాగుంటుందని యండమూరి భావించి ఇప్పటికే ఆ కథను చిరంజీవికి కూడా వినిపించినట్టుగా వార్తలైతే వస్తున్నాయి. మరి ఈ సినిమాను చేయడానికి చిరంజీవి పవన్ కళ్యాణ్ ఇద్దరు ఒప్పుకుంటారా లేదా అనే అనుమానలైతే వ్యక్తం అవుతున్నాయి...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: