HBD: బాలయ్య ఆస్తి అన్ని వేల కొట్లా..!

Divya
ఈ రోజున నందమూరి నటసింహ బాలయ్య పుట్టినరోజు సందర్భంగా బాలయ్యకి అభిమానులు బర్తడే విషెస్ చెబుతూ ఆయనకి సంబంధించిన కొన్ని విషయాలు వైరల్ గా చేస్తున్నారు. ముఖ్యంఖ బాలయ్య సినిమాలకు సంబంధించి కూడా టైటిల్ టీజర్లతో పాటు పోస్టర్లను కూడా ప్రకటించి అభిమానులను ఖుషి చేస్తున్నారు. తాజాగా బాలయ్య ఆస్తులు మొత్తం విలువ ఎంత అనే విషయం వైరల్ గా మారుతున్నది. వాటి గురించి చూద్దాం.

బాలకృష్ణ ఆస్తి సుమారుగా 3 వేల కోట్ల రూపాయలు ఉంటుందని సమాచారం. ఇందులో తన తండ్రి వారసత్వం నుంచి వచ్చిన వాటిలో ముఖ్యంగా థియేటర్స్ ,హోటల్లు, స్టూడియోలు ఇల్లు వంటివి ఉన్నాయట. అలాగే కొన్ని వందల ఎకరాలు భూములు కూడా ఉన్నాయని సమాచారం. ముఖ్యంగా ఎన్టీఆర్కు ఎనిమిది మంది కొడుకులు ఉన్నప్పటికీ ఆయా ఆస్తులను కూడా కొడుకులు పంచుకోవడం జరిగిందట. ఇప్పటికి చెన్నైలో ఒక ఇల్లు ఉందని వాటిని కూడా అమ్మకానికి పెట్టినట్లు సమాచారం. అలాగే హైదరాబాదులో రామకృష్ణ స్టూడియో అందులో అందరికీ వాటా ఉన్నదట. అలాగే కొన్ని వేల ఎకరాలలో ఒక స్టూడియో కూడా ఉండడం గమనార్హం.

దీని విలువ వేలకోట్లలో ఉంటుందని సమాచారం. ఎన్టీఆర్ అప్పట్లోనే కొన్ని వందల ఎకరాలు కూడా భూమి కొన్నారని అందులో చాలా వరకు అమ్ముకున్నట్లు సమాచారం.. మరికొన్ని ఇల్లును నిర్మించారని సమాచారం. బాలయ్య వారసత్వంగా కొన్ని కోట్లు ఆస్తులు వచ్చాయి. అలా హైదరాబాదులో రెండు లగ్జరీ ఇళ్లతో పాటు.. లగ్జరీ కార్లు కూడా ఉన్నాయట ఈ మధ్యనే కూతురు బ్రాహ్మణి ఒక గిఫ్ట్ కూడా కారును ఇచ్చింది. అలా సుమారుగా బాలయ్య దగ్గర ఉండే కార్ల విలువ 25 కోట్ల పైగా ఉంటాయని సమాచారం. హైదరాబాద్ శివారులలో కూడా కొంత భూమి ఉన్నదట. ఆంధ్రాలో కూడా చాలా చోట్ల ల్యాండ్ ఉన్నాయని, బాలయ్య అఫిడవిట్లో తెలిపిన ప్రకారం తన పేరు మీద 81.63 కోట్లు ఆస్తి ఉన్నట్లు అలాగే భార్య పేరు మీద 140 కోట్లు.. కుమారుడు పేరు మీద 58 కోట్లు.. అప్పులు 9 కోట్లు తన భార్య పేరు మీద మూడు కోట్లు ఉన్నారు చూపించారు. అయితే మన అధికారికంగా సుమారుగా 3000 కోట్లు ఉన్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: