ఎలుకలు చేసిన ఆ పనికి లక్షల్లో నష్టపోయిన యంగ్ హీరో.. ఏంటి బాసు ఇది..!

lakhmi saranya
ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తమకంటూ ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పాటు చేసుకున్న వారిలో బాలీవుడ్ హీరో కార్తీక్ కూడా ఒకరు. 2011లో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈయ‌న‌..మొదటి సినిమాతోనే మంచి క్రేజ్ ని సంపాదించుకున్నాడు. ఇక అనంతరం అనేక సినిమాల్లో నటించి మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ప్రజెంట్ వరస సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్నారు. అయితే 2020లో వచ్చిన భూల్ భూలయ్యా బాలీవుడ్ లో భారీ కలెక్షన్స్ రాబట్టిన చిత్రంగా నిలిచింది. దీంతో కార్తీక్ స్టేటస్ మొత్తంగా మారిపోయింది.
ఇక ఈ క్రమంలోనే ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో టి సిరీస్ ‌ అధినేత ఏకంగా 4.72 కోట్ల విలువైన మెక్‌లారెన్ కారును కార్తీక్కు గిఫ్టుగా ఇచ్చాడు. అయితే తాజాగా అందుతున్న సమాచారం మేరకు కోట్లు విలువ చేసే ఈ కారును ఎలుకలు పాడు చేసినట్లు తెలుస్తుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ కార్తీక్.." తాజాగా నా కారులోని మ్యాట్ ను ఎలుకలు పాడుచేసాయి. కేవలం మ్యాట్స్‌ వేసేందుకే లక్షల రూపాయల్లో భారీగా ఖర్చు చేయాల్సి వచ్చింది. ప్రస్తుతం నా కారు.. కారు గ్యారేజీలో పార్క్ చేసి ఉంది " అంటూ తెలియజేశాడు కార్తీక్.
ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో.." డబ్బున్న వారి ఇంట్లో కూడా ఎలుకులు ఉంటాయా. ఇది చాలా ఆశ్చర్యంగా ఉంది. ఏకంగా మ్యాట్ పోయినందుకు లక్షల్లో ఖర్చు అయ్యిందా? మీ పనే బాగుంది. కారు మ్యాట్ల కోసం లక్షల్లో పోస్తున్నారు. ఇది కలికాలం అనే చెప్పుకోవచ్చు. గొప్పోడింట్లో ఎలకల బాధ అంటే ఆలోచించాల్సిన విషయమే. మధ్య తరగతి వాళ్ళ ఇంట్లో ఎలుకలు ఉండడం చాలా కామన్. మీ చుట్టూరు ఉండే సెక్యూరిటీ గాడ్స్‌ చీమలనే లోపలికి రానివ్వరు. అటువంటిది ఎలకలను మీ ఇంట్లో తిరగనిచ్చారా? " అంటూ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: