హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అయిన యాంకర్ దీపికా పిల్లి..!?

Anilkumar
ఒకప్పుడు సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ అవ్వాలి అంటే ఎంతో కష్టపడేవారు. రాత్రింబవళ్లు ఇండస్ట్రీస్ చుట్టూ తిరిగేవాళ్లు  అంతేకాదు ఒక సినిమా చేశాక వాళ్ళకి గుర్తింపు కూడా వచ్చేది కాదు. నాలుగైదు సినిమాలు చేసిన తర్వాతే గుర్తింపు లభించేది. అంతేకాదు ఒకప్పుడు కేవలం తెలుగు అమ్మాయిలు మాత్రమే హీరోయిన్స్ గా ఉండేవారు. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యింది. ఒకప్పుడు కేవలం తెలుగు అమ్మాయిలే ఉన్న సినీ ఇండస్ట్రీలో ఇప్పుడు ఒక్క తెలుగమ్మాయి కూడా లేదు. అసలు తెలుగు అమ్మాయిలని చూద్దాం అన్నా కూడా

 కనిపించడం లేదు. ఆ విధంగా సినీ ఇండస్ట్రీకి దూరమయ్యారు తెలుగు అమ్మాయిలు. ఒకరు ఇద్దరు వస్తున్నప్పటికీ టాలీవుడ్ వాళ్ళని ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ఇతర ఇండస్ట్రీలకి ఎంట్రీ ఇస్తూ అక్కడ మాత్రం మంచిగా గుర్తింపును సంపాదించుకుంటున్నారు. అయితే టాలీవుడ్ లో ఒకప్పుడు ఇలాంటి హవా నడిచి నప్పటికీ ఎప్పుడు మాత్రం అలా లేదు. ఇప్పుడు టాలీవుడ్ ని ఇండస్ట్రీకి చాలామంది తెలుగమ్మాయిలు హీరోయిన్ కావాలి అన్న ఆసక్తితో వస్తున్నారు. అందులో భాగంగానే చాలామంది తెలుగు అమ్మాయిలు స్టార్ హీరోయిన్స్

 గా కొనసాగుతున్నారు. ఇప్పటికె వైష్ణవి చైతన్య హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చి వరుస అవకాశాలను అందుకుంటు దూసుకుపోతోంది. కేవలం ఒకే ఒక్క సినిమాతో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ అయిపోయింది ఈ అమ్మాయి.  అదేవిధంగా దేత్తడి హారిక సైతం ఒక సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. శోభన్ సంతోష్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇవ్వబోతోంది. అయితే తాజాగా ఇప్పుడు ఈ లిస్టులోకి మరొక తెలుగు అమ్మాయి కూడా చేరబోతోంది. ఆమె హీరోయిన్గా పరిచయం అవ్వబోతున్నట్లుగా తెలుస్తోంది. ఆమె మరెవరో కాదు సోషల్ మీడియా ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న దీపిక పిల్లి. అయితే దీపిక పిల్లి మొదట బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చి పలు షోల కి యాంకర్ గా వ్యవహరించింది. అలా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈమె తనకి యాక్టింగ్ పై ఉన్న ఇష్టంతో ఇప్పుడు హీరోయిన్ గా నటించాలని కోరుకుంటుంది. ఇందులో భాగంగానే తనకి  తాజాగా ఒక సినిమాలో నటించే అవకాశం వచ్చినట్లుగా తెలుస్తోంది. అది కూడా యాంకర్ ప్రదీప్ హీరోగా నటిస్తున్న సినిమాలో..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: