సరికొత్త సినిమాతో యాంకర్ ప్రదీప్.. హీరోయిన్ ఎవరో తెలుసా..!?

Anilkumar
బుల్లితెరపై టాప్ యాంకర్ గా కొనసాగుతున్న వారిలో యాంకర్ ప్రదీప్ ముందు వరుసలో ఉంటాడు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు రేడియో జాకీగా తన కెరియర్ని ప్రారంభించిన ప్రదీప్ ఆ తరువాత ఆర్టిస్ట్ గా సినీ ఇండస్ట్రీకి వచ్చాడు. ఎన్నో సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చేసాడు. అదే సమయంలో బుల్లితెరపై యాంకర్ గా చేసే అవకాశం రావడంతో యాంకర్ గా తన కెరీర్ ను ప్రారంభించాడు. అలా ఒక్కో మెట్టు ఎక్కుతూ ఎంతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అంతేకాదు తెలుగులో లీడింగ్ లో ఉన్న అన్ని ఎంటర్టైన్మెంట్స్ లో ప్రదీప్

 యాంకర్ గా  చేస్తున్నాడు. అంతేకాదు నటుడిగా కూడా ఇటీవల ఎంట్రీ ఇచ్చాడు. నటుడుగా కూడా ఎన్నో అవకాశాలను దక్కించుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో 30 రోజుల్లో ప్రేమించడం ఎలా అనే ఒక సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు ప్రదీప్. ఇక ఈ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు. అయితే ఈ సినిమా తరువాత తనకి హీరోగా చేసే అవకాశాలు వస్తాయి అని అనుకున్నాడు కానీ ఊహించని విధంగా అలా జరగలేదు. ఆ తర్వాత తనకి సరిగ్గా మ్యాచ్ అయ్యే కథలు రాకపోవడంతో సినిమాలకి కాస్త బ్రేక్ ఇచ్చిన

 ప్రదీప్ తాజాగా ఇప్పుడు మరొక కొత్త సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా వార్తలు వినబడుతున్నాయి. ఇకపోతే ఈ సినిమాలో హీరోయిన్ ఎవరు అన్నది ఇప్పుడు చర్చనీ అంశంగా మారింది. కానీ తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం బుల్లితెరపై యాంకర్ గా రాణిస్తూ మంచి పేరు తెచ్చుకున్న దీపిక పిల్లి ను ఇందులో హీరోయిన్ గా సెలెక్ట్ చేసినట్లుగా వార్తలు వినబడుతున్నాయి. ఇప్పటికే వీళ్లిద్దరూ కలిసి ఢీ షోకి యాంకర్లు గా వ్యవహరించారు. ఆ తరువాత నటిగా దీపికా ప్రస్తుతం సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. దీంతో ఇప్పుడు వీళ్ళిద్దరి కాంబినేషన్ లో ఒక సినిమా రాబోతున్నట్లుగా తెలుస్తోంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: