యమదొంగ సినిమాలో హీరోయిన్ ఇప్పుడు ఏలా మారిపోయిందో..!?

Anilkumar
జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన అన్ని సినిమాలు దాదాపుగా మంచి విజయాలను అందుకున్నాయి. ఇక అలాంటి సూపర్ హిట్ సినిమాల్లో యమదొంగ సినిమా కూడా ఒకటి. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో ఒకరైన రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా 2007లో విడుదలయ్యింది. అయితే ఈ సినిమా కంటే ముందు వీళ్ళిద్దరి కాంబోలో వచ్చిన స్టూడెంట్ నెంబర్ వన్ సింహాద్రి సినిమాలు మంచి విజయాన్ని అందుకున్నాయి. అలాగే యమదొంగ సినిమా సైతం భారీ విజయాన్ని సాధించింది. అంతేకాదు దీనికి గాను నంది అవార్డు

 సైతం వచ్చింది. ఇక ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్కి జోడిగా ప్రియమణి హీరోయిన్ గా నటించింది. అలాగే మోహన్ బాబు మమతా మోహన్దాస్ అర్చన ప్రీతి జింగ్యాని వంటి వారందరూ కీలక పాత్రలో కనిపించారు. ఇకపోతే ఇందులో జూనియర్ ఎన్టీఆర్ తో నెల్లూరు యాసలో మాట్లాడుతూ హీరోయిన్ మమతా మోహన్ దాస్ బాగా ఇబ్బంది పెడుతుంది. అయితే ఇందులో భాగంగానే వీళ్ళిద్దరికీ మధ్య వచ్చే సన్నివేశాలు సినిమాకి హైలైట్. ఇక ఈ సినిమా తర్వాత తనకి వరుస సినిమాల్లో నటించే అవకాశం కూడా దక్కింది. అయితేదీని తర్వాత

 ఆమె పలు సినిమాల్లో నటించినప్పటికీ యమదొంగ సినిమా తీసుకువచ్చినంత క్రేజ్ మరే సినిమా తీసుకురాలేదు. ఈ సినిమా తర్వాత మమత మోహన్ దాస్ నటించిన పలు సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర నిరాశ పరిచినప్పటికీ ఆ తర్వాత వెంకటేశ్ సరసన నటించిన చింతకాయల రవి కృష్ణ అర్జున హోమం వంటి సినిమాలు మంచి టాక్ తెచ్చుకున్నాయి. అలా  సినిమాలతో బిజీగా ఉన్న సమయంలోనే ఈమె క్యాన్సర్ బారిన పడింది. కొన్నేళ్ల పాటు క్యాన్సర్ చికిత్స తీసుకుంటూ ఇప్పుడు ఆరోగ్యంగా ఉంది. అయితే చాలా కాలం క్యాన్సర్ తో విరామం తీసుకుంటున్న మమత మోహన్ దాస్ ప్రస్తుతం పలు మలయాళ సినిమాల్లో నటిస్తోంది. ఇటీవల తెలుగులోకి కూడా రీ ఎంట్రీ ఇచ్చింది. అలా ప్రస్తుతం సోషల్ మీడియాలో సైతం యాక్టివ్ గా ఉన్న ఈ బ్యూటీ కి సంబంధించిన పలు ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: