గేమ్ చేంజర్ కోసం అదిరిపోయే సాంగ్ ప్లాన్ చేస్తున్న డైరెక్టర్..!?

Anilkumar
త్రిబుల్ ఆర్ సినిమాతో గ్లోబల్ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ సినిమా గేమ్ చేంజర్. స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాని టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. కాగా ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ డ్యూయల్ పాత్రలో కనిపించబోతున్నట్లుగా తెలుస్తోంది. తండ్రి కొడుకులుగా రాంచరణ్ ఇందులో కనిపించనున్నట్లుగా సమాచారం. అయితే ఇందులో తండ్రి పాత్ర అప్పన్నగా రామ్ చరణ్ నాయకుడు పాత్రలో కనిపించబోతున్నట్లుగా

 తెలుస్తోంది. ఇక కొడుకుగా రామ్ నందన్ అనే పాత్రలో ఒక పవర్ఫుల్ ఐఏఎస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నట్లుగా గత కొంతకాలంగా సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున వార్తలు ప్రచారం చేస్తున్నారు. ఇక ఈ విషయంలో నిజమెంతుందో తెలియదు కానీ ఇవే వార్తలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వినబడుతున్నాయి. ఇకపోతే ఇందులో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కి జోడిగా కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తోంది. అలాగే టాలీవుడ్ ఒకప్పటి స్టార్ హీరోయిన్ అంజలి మరొక హీరోయిన్ పాత్రలో కనిపించబోతున్నట్లుగా సమాచారం వినబడుతోంది. అయితే ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ ఎప్పుడో పూర్తి కావాల్సింది. కానీ డైరెక్టర్ శంకర్ ఈ సినిమా చేస్తూనే

 మరొకవైపు ఇండియన్ టు సినిమా కూడా చేస్తున్నాడు. ఒకేసారి రెండు సినిమాలతో బిజీగా ఉన్నా డైరెక్టర్ ఏ సినిమాని ముందుగా విడుదల చేయాలి అన్న కన్ఫ్యూజన్లో పడ్డాడు. అందుకే గేమ్ చేంజర్ సినిమా కాస్త వెనకబడింది అని చెప్పొచ్చు. అయితే ప్రస్తుతం ఇండియన్ టు సినిమా విడుదల కి సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలోని సినిమాతో బిజీగా ఉన్నాడు డైరెక్టర్. ఇందులో భాగంగానే ఇప్పుడు గేమ్ చేంజర్  సినిమా పై సోషల్ మీడియా లోపల అప్డేట్స్ వినబడుతున్నాయి. అదేంటంటే ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ చివరి దశకు చేరుకుంది అని.. దీనికి సంబంధించిన షూటింగ్ రాజమండ్రిలో జరుగుతుంది అని.. ఇందులో భాగంగానే ఒక భారీ స్పెషల్ సాంగ్ కూడా ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: