ప్రముఖ నటి ఇంట్లో చోరీ.. నష్టం ఎంతంటే..?

Divya
చాలామంది సెలబ్రిటీల ఇళ్లల్లో దొంగతనాలు జరిగిన సంఘటనలు మనం వినే ఉంటాము. ఇప్పుడు తాజాగా ప్రముఖ నటి ఇల్లు దోపిడికి గురైనట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. దొంగలు డబ్బు బంగారం దొంగిలించినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. అసలు విషయంలోకి వెళ్తే ప్రముఖ నిర్మాత కమ్ నటి శ్వేతా షిండే ఇంట్లో ఇటీవల దొంగతనం జరిగినట్లుగా వెల్లడించింది. ఈ ఘటన ఇండస్ట్రీని ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురిచేసింది. మహారాష్ట్ర సతార ప్రాంతాలలో ఈ నటీ నివసిస్తున్నట్లు తెలుస్తోంది.

అందుతున్న సమాచారం ప్రకారం నటి శ్వేతా షిండే ఇంట జూన్ మూడవ తేదీన దొంగతనం జరిగిందట. తన తల్లితో కలిసి ఆమె ఇంట్లో నివసిస్తున్న సమయంలోనే ఇంట్లో ఎవరూలేని విషయాన్ని గుర్తించి ఈ దొంగతనం చేసినట్లుగా తెలుస్తోంది. నటి శ్వేతా సమీప పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారట. నటి శ్వేత ఎక్కువగా ముంబైలో ఉంటున్న సమయంలోనే ఈ దొంగతనం జరిగినట్లు సమాచారం. సుమారుగా 110 గ్రాముల నగలు కొంతమేరకు నగదు కూడా దొంగలించినట్లు ఆమె ఫిర్యాదులు తెలియజేసింది. జూన్ మూడవ తేదీ సోమవారం రాత్రి ఈ సంఘటన జరిగిందట.

10 తులాల బంగారం డబ్బు అపహరణ జరిగింది. అంటూ ఆమె ఫిర్యాదుల తెలియజేసింది. అయితే ఎంత నగదు అనే విషయాన్ని మాత్రం ఈమె తెలియజేయలేదు త్వరలోనే నేరస్తులను సైతం పట్టుకుంటామంటూ పోలీసులు వెల్లడించారు. శ్వేతా సిండే డాక్టర్ డాన్ సీరియల్ ల నిర్మాతగా మంచి పాపులారిటీ అందుకున్నది అలాగే..1998 cid , కుంకుమ్, బ్లాక్ బస్టర్ చిత్రం తదితర వాటిలో నటించింది. 2007లో సందీప్ బన్సాలిని వివాహం చేసుకున్న శ్వేతా షిండే ఒక కూతురు కూడా జన్మించింది. 2016లో వజ్ర ప్రొడక్షన్ పేరుతో సొంత నిర్మాణ సంస్థను కూడా మొదలుపెట్టారు. శ్వేత సింధు ప్రస్తుతం నటనకు దూరంగా ఉంటూ నిర్మాతగా పలు ప్రాజెక్టులు చేస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: