కెరియర్ లో మొదటిసారి అలాంటి సినిమా చేయబోతున్న మృణాల్.. రిస్క్ చేస్తుందా..!?

Anilkumar
సీతారామం సినిమాతో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ అయిపోయింది మృనాల్ ఠాగూర్. కేవలం ఒకే ఒక్క సినిమాతో స్టార్ హీరోయిన్ల లిస్టులోకి చేరిపోయింది. ఇక ఈ సినిమా తర్వాత తనకి వరుస సినిమాల్లో చేసే అవకాశం వచ్చింది. అలా హాయ్ నాన్న సినిమా చేసింది. దీంతో మరొక బ్లాక్ బస్టర్ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఈ సినిమా తర్వాత ఈ ఏడాది ఫ్యామిలీ స్టార్ అనే సినిమాతో మళ్ళీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ఈ సినిమాలో హీరోయిన్గా నటించి డిజాస్టర్ అందుకుంది మృణాల్. ఈ సినిమా బాగానే

 ఉన్నప్పటికీ స్క్రీన్ ప్లే పెద్దగా లేకపోవడంతో మెప్పించలేకపోయింది ఫ్యామిలీ స్టార్. అయితే ఫ్యామిలీ స్టార్ తో హ్యాట్రిక్ అందుకున్న మృణాల్ ఠాకూర్ కోరిక తీరలేదు. దాదాపుగా 50 కోట్ల భారీ బడ్జెట్ తో వచ్చిన ఈ సినిమా 20 కోట్ల వరకే వసూళ్లని రాబట్టి నిర్మాతలకి నష్టాన్ని మిగిల్చింది అని చెప్పాలి. అయితే ఒకవైపు తెలుగు సినిమాలు మరొకవైపు హిందీ సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. అలాగే వెబ్ సిరీస్ సైతం చేస్తూ క్షణం కూడా తీరిక లేకుండా బిజీగా గడుపుతోంది. గత నాలుగు ఏళ్లలో మృణాల్ ఠాగూర్ హిందీలో వరుస సినిమాలు చేస్తున్నప్పటికీ ఒక్క హిట్ కూడా అందుకోలేకపోయింది. ఇప్పటికే ఈమె హిందీలో హీరోయిన్గా నటించిన పలు సినిమాలు ఫెయిల్ అయ్యాయి. ప్రస్తుతం

 హిందీలో పూజా మేరీ జాన్ అనే సినిమా చేస్తోంది.  అయితే ఇప్పటికే తెలుగులో ఒక సినిమాతో డిజాస్టర్ అందుకున్న మృణాల్ హిందీలో అయినా హిట్టు కొట్టాలి అని చూస్తుంది. ఇందులో భాగంగానే మృణాల్ ఠాగూర్ కి సంబంధించిన ఒక వార్త ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది. అదేంటంటే కాంచన సిరీస్ నాలుగవ పార్ట్ లో హీరోయిన్గా మృణల్ ఠాకూర్ కనిపించబోతున్నట్లుగా వార్తలు వినపడుతున్నాయి. అంతేకాదు ఈ హారర్ సినిమాతో కోలీవుడ్ ఇండస్ట్రీకి  ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు గా సమాచారం వినబడుతోంది. అంతేకాదు ఇప్పటికే  సినిమాలోని తన క్యారెక్టర్ డిజైన్ చేసిన తీరు బాగా నచ్చడంతో మృణాల్ ఈ సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఇక ఈ వార్త తెలుసుకున్న ఆమె అభిమానులు ఇప్పటివరకు డీసెంట్ సినిమాల్లో నటించి ఒకేసారి హారర్ సినిమాలో నటిస్తే ఎలా అంటూ కామెంట్లు పెడుతున్నారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: