ఓటీటీ లోకి కార్తికేయ భజే వాయు వేగం.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..!!

Anilkumar
టాలీవుడ్ యంగ్ హీరో కార్తికేయ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. గత ఏడాది బెదురులంక సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న కార్తికేయ ఆ సినిమా తర్వాత చాలా గ్యాప్ తీసుకుని ఇటీవల భజే వాయు వేగం అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇక ఈ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నాడు. టైటిల్ చాలా డిఫరెంట్ గా ఉన్నప్పటికీ కాన్సెప్ట్ మాత్రం చాలా అద్భుతంగా ఉంది. ప్రశాంత్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా క్రైమ్ త్రిల్లర్ నేపథ్యంలో వచ్చింది. ఇక ఇందులో కార్తికేయ కి జోడిగా

 ఐశ్వర్య మీనన్ నటించింది. దాంతో పాటు హ్యాపీ డేస్ రాహుల్ టైసన్ కీలక పాత్రలో కనిపించాడు. ఎప్పటినుండో ఈ సినిమా నుండి విడుదల చేస్తున్న టీజర్ ట్రైలర్ పోస్టర్లు సినిమాపై అంచనాలను భారీగా పెంచేశాయి.  ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి ఈ సినిమాను ప్రమోట్ చేయడంతో సినిమాపై అంచనాలు తారస్థాయికి వెళ్లిపోయాయి. భారీ అంచనాల నడుమ మే 31న విడుదలైన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. అంతేకాదు కార్తికేయ నటనకు మంచి మార్కులు పడ్డాయి. అలాగే సినిమాలోని త్రిల్లింగ్ ఎలిమెంట్స్ ట్విస్ట్ లు

 అత్యద్భుతంగా ఉన్నాయి అని క్లైమాక్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ లో ఉంది అని చాలామంది రివ్యూలు కూడా ఇచ్చారు. అయితే ఈ సినిమా విడుదలైన సమయంలో దీనికి పోటీగా గుండెల్లో గోదారి గం గం గణేశా వంటి సినిమాలు కూడా విడుదలయ్యాయి. అదే ఈ సినిమాకి కాస్త మైనస్ అయింది అని చెప్పాలి. ఒకవేళ ఏ సినిమాలో పోటీ లేకుండా అదొక్కటే సినిమా విడుదల అయి ఉంటే కనుక బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకొని ఉండేది. అయితే తాజాగా ఇప్పుడు ఈ సినిమా ఓటిటి పార్ట్నర్ ఫిక్స్ చేసుకున్నట్లుగా సమాచారం వినబడుతోంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫారం ఈ సినిమా యొక్క డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఏ సినిమా అయినా సరే థియేటర్లో విడుదలైన నెల రోజుల తర్వాత ఓటీటీ లోకి వస్తుంది .అలాగే ఇప్పుడు భజే వాయు వేగం సినిమా కూడా నెలరోజుల తర్వాత ఓటీటీ లోకి రాబోతోంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: