హృతిక్ రోషన్, ఎన్టీఆర్ వార్ 2 లో ఆ బాలీవుడ్ స్టార్ హీరోయిన్..!?

Anilkumar
జూనియర్ ఎన్టీఆర్ త్రిబుల్ ఆర్ సినిమా తర్వాత సినిమాల పరంగా ఫుల్ ఫామ్ లో ఉన్నాడు. కేవలం తెలుగు సినిమాలే కాకుండా హిందీ సినిమాలు చేయడానికి కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు. త్రిబుల్ ఆర్ సినిమా తర్వాత జూనియర్ ఎన్టీఆర్కి గ్లోబల్ స్థాయిలో గుర్తింపు దక్కిన సంగతి మనందరికీ తెలిసిందే. అందులో భాగంగానే బాలీవుడ్ కి ఎంట్రీ ఇవ్వబోతున్న జూనియర్ ఎన్టీఆర్ వార్ 2  సినిమాలో నటించబోతున్నాడు. బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ నటిస్తున్న ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ ఒక కీలక పాత్రలో

 కనిపించబోతున్నట్లుగా తెలుస్తోంది. బ్రహ్మాస్త్రం మూవీ ఫేం అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాని యశ్ రాజ్ ఫిలిమ్స్ స్పై యూనివర్స్ లో భాగంగా తెరకెక్కిస్తున్నారు.  ఈ సినిమాని బిగ్గెస్ట్ యాక్షన్ చిత్రంగా తీసుకురాబోతున్నారు. ఇకపోతే ఈ సినిమాలో చాలామంది స్టార్ హీరోలు పలు కీలకపాత్రలో కనిపించబోతున్నట్లుగా గత కొద్ది రోజులుగా వార్తలు వినబడుతున్న సంగతి చాలామందికి తెలిసి ఉంటుంది. అయితే ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్లో జాయిన్ అయ్యాడు జూనియర్ ఎన్టీఆర్. వీళ్ళిద్దరి కాంబినేషన్లో వస్తున్న ఈ బిగ్గెస్ట్ మల్టీ స్టార్ మూవీ 2025 ఆగస్టు 14న భారీగా విడుదల కాబోతోంది. ఇప్పటికి దీనికి సంబంధించిన అనౌన్స్మెంట్ సైతం

 చేశారు చిత్ర బృందం. ఇందులో భాగంగానే ఇప్పుడు దీనికి సంబంధించిన షూటింగ్ సైతం శరవేగంగా జరుపుతున్నారు. మరి ఇప్పటికే తెలుగు ప్రేక్షకుల చేత స్టార్ హీరో అని అనిపించుకున్న జూనియర్ ఎన్టీఆర్ బాలీవుడ్ సినిమాలు చేసి అక్కడి ప్రేక్షకులను మెప్పిస్తాడా లేదా అన్నది చూడాల్సి ఉంది. ముఖ్యంగా బాలీవుడ్ ప్రేక్షకులకి జూనియర్ ఎన్టీఆర్ అంటే చాలా ఇష్టం. మరి దాన్ని జూనియర్ ఎన్టీఆర్ వార్ టు సినిమాతో నిలబెట్టుకుంటాడా అన్నది చూడాలి. అయితే ఇప్పటికే చాలామంది స్టార్స్ నటిస్తున్న ఈ సినిమాలో ఇప్పుడు మరొక స్టార్ హీరోయిన్ కూడా ఆడ్ అయినట్లుగా తెలుస్తోంది. ఆ స్టార్ హీరోయిన్ మరెవరో కాదు బాలీవుడ్ స్టార్ నటి ఆలియా భట్. ఇందులో ఆలియా ఒక కీలక పాత్రలో కనిపించబోతున్నట్లుగా వార్తలు వినబడుతున్నాయి..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: