ప్రశాంత్ నీల్ మూవీ కోసం ఎన్టీఆర్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..!?

Anilkumar
జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న లేటెస్ట్ సినిమా దేవర. మాస్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా బిగ్గెస్ట్ యాక్షన్ నేపథ్యంలో రాబోతోంది. ఇకపోతే వీళ్ళిద్దరి కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమా రెండు పర్ట్స్ గా రాబోతోంది. కాగా మొదటి భాగం అక్టోబర్ 10న అంటే దసరా కానుకగా విడుదల చేయాలి అని ఇప్పటికే మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఇకపోతే ఇందులో బాలీవుడ్ బ్యూటీ జాన్వి కపూర్ జూనియర్ ఎన్టీఆర్ సరసన హీరోయిన్గా కనిపించబోతోంది. దాంతో పాటు బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్రలో

 కనిపించబోతున్నారు. అనిరుద్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా నుండి ఇప్పటికే ఫస్ట్ సింగిల్ విడుదల చేశారు. ఇక అది సోషల్ మీడియాలో ఇప్పుడు దుమ్ము లేపుతోంది అని చెప్పాలి. అయితే జూనియర్ ఎన్టీఆర్ ఈ సినిమా అయిపోయిన తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో మరొక సినిమా చేయబోతున్నాడు. ఇప్పటికి దానికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా బయటపెట్టారు. ఇటీవల జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా వీళ్ళిద్దరి కాంబినేషన్లు రాబోయే సినిమాకి సంబంధించిన అధికారికి ప్రకటన అనౌన్స్ చేశారు మేకర్స్. అంతేకాదు ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ సైతం ఆగస్టు నుండి స్టార్ట్ చేయబోతున్నట్లుగా movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">మైత్రి మూవీ మేకర్స్ అధికారిక

 ప్రకటన చేశారు. ఇదిలా ఉంటే ఇప్పుడు ప్రశాంత్ తో సినిమా కోసం జూనియర్ ఎన్టీఆర్ తీసుకుపోయే రెమ్యూనరేషన్ కి సంబంధించిన వార్తలు ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి. ఇక దీనికి సంబంధించిన తాజా అప్డేట్ ఏంటంటే.. ఈ సినిమా కోసం జూనియర్ ఎన్టీఆర్ ఏకంగా 130 కోట్ల భారీ రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లుగా వార్తలు వినబడుతున్నాయి. ఇక వీళ్లిద్దరి కాంబోలో వస్తున్న ఈ సినిమా బిగ్గెస్ట్ యాక్షన్ సినిమాగా రాబోతున్నట్లుగా తెలుస్తోంది. త్వరలోనే సినిమాకి సంబంధించిన ఇతర వివరాలను కూడా మేకర్స్ వెల్లడించే అవకాశాలు ఉన్నాయి... దీంతో ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ ఈ సినిమా కోసం తీసుకుపోతున్న రెమ్యునరేషన్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: