రోజాపై జబర్దస్త్ కమెడియన్ షాకింగ్ కామెంట్స్..!

Divya
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసిపి ఓటమి కారణాలు ఏంటి అనే విషయం పైన నేతలు అధినేత కార్యకర్తలు సైతం తెగ వెతికేస్తూ ఉన్నారు.. ముఖ్యంగా వైసీపీ పార్టీలో ఫైర్ బ్రాండ్ గా పేరు పొందిన రోజా పేరును సంపాదించుకుంది. చాలా సందర్భాలలో అడ్డు అదుపు లేకుండా చేసిన విమర్శలు ఆ పార్టీకి మైనస్ అయ్యాయని చాలామంది తెలియజేస్తూ ఉంటారు. అయితే ఏపీలో ఎన్నికల ఫలితాలు వెలువడడానికి ముందే రోజా గురించి షకలక శంకర్ కొన్ని కామెంట్స్ చేశారు. రోజా గారు చేసిన తప్పులను వదలరని తప్పు చేసిన వాళ్ళు ఎవరు చేసినా తప్పే అంటూ షకలక శంకర్ తెలియజేశారు.

తప్పు ఈరోజు కాకపోయినా ఏదో ఒక రోజు బయటకు రావాల్సిందే.. రోజా గారు మనసులను మరిచిపోయి మాట్లాడడం సరైన పద్ధతి కాదు అంటూ కూడా తెలియజేశారు గెలిస్తే విర్రవీగి మాట్లాడకూడదని తన నోటి నుంచి చెప్పలేను మాటలు ఎన్నోసార్లు అన్నారంటూ షకలక శంకర్ తెలియజేశారు. ముఖ్యంగా రోజా గారే కాకుండా చాలామంది నేతలు కూడా మాట్లాడారని ఇప్పుడు ఒక చరిత్ర ముగిసిపోయింది అంటే తెలియజేశారు. పవన్ కళ్యాణ్ ఒక ట్రెండ్ సెట్టర్ అని మేము అనుకుంటున్నామని కూడా తెలియజేశారు.

పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడూ కూడా సమాజ సేవ కోసమే కోరుకుంటారని ఆయన ఎంతోమంది మహానుభావులు రాసిన పుస్తకాలను చదివి ఈ స్థాయికి వచ్చారని కూడా షకలక శంకర్ వెల్లడించారు.. పవన్ కళ్యాణ్ మహా జ్ఞాని అంటూ ఆయన జ్ఞానం ఏపీ అభివృద్ధికి ఉపయోగపడుతుందని వెల్లడించారు. ప్రస్తుతం షకలక శంకర్ చేసిన ఈ కామెంట్స్ సైతం సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్నాయి. అయితే జబర్దస్త్ కమెడియన్స్ సైతం గత కొద్ది రోజుల నుంచి రోజా పైన చాలా వల్గర్ గా మాట్లాడుతున్నారు. దీంతో ఆమె అభిమానులు కూడా వారి మీద ఫైర్ అవుతున్నారు. మరి ఈ విషయం మీద రోజా ఎలా స్పందిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: