వాళ్ళను చూసి ఎంతో స్ఫూర్తి పొందాను : సమంత

Anilkumar
కెరీర్ పరంగా చాలా గ్యాప్ తీసుకున్న తర్వాత సమంత  మళ్ళీ ప్రేక్షకులను అలరించడానికి తెర మీదకి వస్తుంది. అయితే ఈమె సిని రంగంలో పోటీ తత్వాన్ని పాజిటివ్ గా తీసుకుంటానని అంతేకాకుండా మరింత కష్టపడి పనిచేయడానికి అదొక ప్రేరణగా పనిచేస్తుందని సమంత అభిప్రాయపడింది. అయితే ప్రముఖ ఎంటర్ టైన్మెంట్ వెబ్సైట్ ఐ ఎండీబీ రిలీజ్ చేసిన టాప్ 100 మోస్ట్ వ్యూవ్డ్‌ ఇండియన్‌ స్టార్స్‌ లిస్టులో 13వ స్థానాన్ని సమంత దక్కించుకున్న విషయం తెలిసిందే. 

అయితే ఈ సందర్భంగా సమంత తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.....'ప్రతి రంగంలో పోటీ ఉంటుంది నేను నా తోటి నటీనటులను చూసి ఎంతో స్ఫూర్తి  పొందుతాను. వారిలా మంచి సక్సెస్ ను సాధించాలంటే ఎంతో కష్టపడాలని అనుకుంటాను. మనలో పోటీ తత్వం సృజనాత్మక శక్తులను బయటికి తీస్తుంది. ఈ విషయాలలో అయినా పోటీ ఉంటేనే మన ప్రతిభ మరింత పెరుగుతుందని భావిస్తాను'అంటూ చెప్పుకొచ్చింది. ఇక ఈవిషయం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇదిలా ఉంటే సమంత తాజాగా ''మా ఇంటి బంగారు'' తల్లి అనే సినిమాలో నటిస్తుంది.

ఇక ఈ చిత్రాన్ని ఆమె స్వీయ నిర్మాణ సంస్థలో తరకెక్కిస్తోంది. సమంత ఇటీవలే  సినిమాకి సంబందించిన పోస్టర్ ను సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది. కొన్ని అనివార్య కారణాల వల్ల సినిమాలకు దూరమైన సమంత తిరిగి మళ్ళీ ప్రేక్షకుల ముందుకు రావడంతో అభిమానులు ఆమె సినిమా కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు.ఈ సినిమాతో పాటూ హిందీలో వరుణ్ ధవన్ తో కలిసి సిటాడెల్ అనే వెబ్ సిరీస్ చేసింది. ఈరీసెంట్ గానే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సిరీస్ కూడా త్వరలోనే రిలీజ్ కానుంది. ఇక ఈ సినిమాల ద్వారా సమంత ఎలాంటి సక్సెస్ను అందుకుంటుదో చూడాలి. ఇక తను కొద్ది రోజులపాటు తెరమీద కనిపించనపట్టికి కూడా తనకున్న క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: