ఎన్టీఆర్ తో నటించేందుకు ఆ కండీషన్ పెట్టిన రష్మిక మందన?

Anilkumar
యంగ్ టైగర్ ఎన్టీఆర్ వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు. తాజాగా కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ దేవర సినిమా చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈ సినిమా తెరకెక్కబోతోంది. ఇక ఈ చిత్రం రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుంది. సముద్రం బ్యాక్ డ్రాప్ తో వస్తున్న ఈ సినిమా లో ఎన్టీఆర్ డిఫరెంట్ లుక్ తో ప్రేక్షకులను అలసించనున్నాడు. ఇందులో ఎన్టీఆర్ సరసన జాన్వి కపూర్ హీరోయిన్ గా నటించగా సైఫ్ ఆలియా ఖాన్ విలన్ గా నటిస్తున్నాడు. కొరటాల శివ  పాన్ ఇండియాగా ఈ మూవీని తెరకెక్కిస్తున్నాడు. అయితే ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన పాట అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటుంది.

దేవర సినిమాతో పాటు ఎన్టీఆర్ బాలీవుడ్ దర్శకుడు ముఖర్జీ దర్శకత్వంలో వార్ 2 సినిమాలో కూడా నటిస్తున్నాడు. ఈ సినిమాలో ఎన్టీఆర్, హృతిక్ రోషన్ తో కలిసి నటిస్తున్నాడు. ఇటు టాలీవుడ్ లోనూ ఆటు బాలీవుడ్ లోనూ ఈ సినిమా పై ప్రేక్షకులలో మంచి అంచనాలు నెలకొన్నాయి. దేవర సినిమాతో పాటు వార్2 సినిమా షూటింగ్ కూడా శరవేగంగా జరుగుతుంది. ఇక ఎన్టీఆర్ ఈ సినిమాలతో పాటు డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో  ఒక సినిమా చేస్తున్నారు తారక్. ఇక ఈ చిత్రాన్ని ఆనౌన్స్ చేసి కూడా చాలా కాలమైంది. ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన పనులు వేగవంతం అయ్యాయని తెలుస్తోంది. అయితే ఈ సినిమాలో నేషనల్ క్రష్ రష్మిక మందన్నాను హీరోయిన్ గా ఎంపిక చేసారట ప్రశాంత్ నిల్.

అయితే ఆమె ఎన్టీఆర్ తో సినిమా చేసేందుకు ఓకే చెప్పిన తర్వాత ఒక కండిషన్ పెట్టిందని తాజాగా వార్తలు వినిపిస్తున్నాయి. రష్మిక ఏం కండిషన్ పెట్టిందంటే... సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప సినిమాలో ఆమె గ్లామర్ రోల్ లోనే ప్రేక్షకులకు కనిపించింది. ఇప్పుడు మళ్లీ డి గ్లామర్ రోల్ లో కనిపించడానికి తను రెడీ లేదు అని టాక్. ఇక ప్రశాంత్ నిల్ ఎలాగైనా తనని హీరోయిన్గా తీసుకోవాలని పట్టుబడట్టంతో ఫైనల్ గా ఓకే చెప్పేసింది ఈ బుట్ట బొమ్మ. ఇక ఈ సినిమాకి ఏకంగా రష్మిక రూ. 7 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఈమె పుష్ప2 సినిమాతో పాటు మరికొన్ని సినిమాలతో బిజీగా ఉంది రష్మిక మందాన.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: